iDreamPost
android-app
ios-app

ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. భోలే షావలి ఔట్!

  • Author Soma Sekhar Published - 03:32 PM, Sat - 11 November 23

బిగ్ బాస్ సీజన్ 7లో పదోవారం షాకింగ్ ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్. ఈ వారం ఎలిమినేషన్ ను బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

బిగ్ బాస్ సీజన్ 7లో పదోవారం షాకింగ్ ఎలిమినేషన్ చేశాడు బిగ్ బాస్. ఈ వారం ఎలిమినేషన్ ను బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.

  • Author Soma Sekhar Published - 03:32 PM, Sat - 11 November 23
ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. భోలే షావలి ఔట్!

బిగ్ బాస్ సీజన్ 7.. మెుదటి నుంచి నాగార్జున చెబుతున్నట్లుగానే ఉల్టా..పుల్టాగా సాగుతోంది ఈ సీజన్. గత 6 సీజన్లతో పోల్చితే.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ షో చాలా వెరైటీగా ప్రేక్షకులను అలరిస్తూ మంచి వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తోంది. ఇక ఎలిమినేషన్స్ తో ఎవరూ ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. గత వారంలో టేస్టీ తేజాను ఎలిమినేట్ చేసి హౌస్ సభ్యులతో పాటుగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన బిగ్ బాస్.. తాజాగా మరో షాకిచ్చాడు. పదోవారం ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

భోలే షావలి.. పాటల బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి.. తన పాటలతో అభిమానులు మెస్మరైజ్ చేశాడు. అప్పటికప్పుడు పాటలకి ట్యూన్ కట్టి పాడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి టాలెంట్ భోలే సొంతం. ఈ విషయం బిగ్ బాస్ సీజన్ 7 చూసిన చాలా మందికి తెలిసే ఉంటుంది. క్షణాల్లో ట్యూన్ కట్టేసి పాట పాడటంలో భోలే సిద్దహస్తుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చిన సందర్భంలో బంతిపూల పాట, తన భార్య వచ్చినప్పుడు భార్య గొప్పదనం వివరిస్తూ పాడిన పాట, ఇక అర్జున్ భార్య సీమంతం వేడుకలో భోలే పాట పాడి తన టాలెంట్ ఏంటో ఈ ప్రపంచానికి చూపించాడు.

ఇదిలా ఉండగా.. పదోవారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, భోలే షావలి, రతిక, యావర్ లు ఉన్నారు. కాగా.. ఏ అన్ అఫీషియల్ పోల్ చూసినా రతికనే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని రిజల్ట్స్ వచ్చాయి. కానీ అనూహ్యంగా.. పదోవారంలో భోలే షావలిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. దీంతో ప్రేక్షకులు షాక్ కు గురైయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7లో భోలే ఎలిమినేషన్ షాకింగ్ అనే చెప్పాలి. కాగా.. భోలే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక ముందు అతడి గురించి, అతడి టాలెంట్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటితో పాటుగా తన సినిమా కెరీర్ ను స్టార్ట్ చేశాడు భోలే. ఇక తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆ హిట్ సాంగ్స్ పాడింది భోలే అని చాలా మందికి తెలీదు.

మాస్ మహారాజా నటించిన కిక్ 2లో ‘అమ్మీ’ సాంగ్ పాడింది భేలే అని మీలో ఎంతమందికి తెలుసు? ఫోక్ సింగర్ గా, ప్రైవేట్ సాంగ్ మేకర్ గా షావలికి యూట్యూబ్ లో మంచి క్రేజ్ ఉంది. భోలే స్వరపరిచిన ‘పాలమ్మినా.. పూలమ్మినా’ సాంగ్ యూట్యూబ్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో మీ అందరికి తెలిసిందే. ఇంతటి ప్రతిభ గల వ్యక్తి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి ఈ వారం భోలే షావలి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al