iDreamPost

Bheemla Nayak OTT : నాయక్ రెండు ఓటిటిల్లో ఎందుకు వస్తున్నట్టు

Bheemla Nayak OTT : నాయక్ రెండు ఓటిటిల్లో ఎందుకు వస్తున్నట్టు

గత నెల 25న విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే మార్చి 25 ఓటిటి ప్రీమియర్స్ కే ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఒక ప్లాట్ ఫార్మ్ లో కాకుండా ఆహాతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా ఒకేసారి రానుంది. గతంలో అల వైకుంఠపురములోకు ఇలాగే సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ కు సేమ్ డే స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడిది రెండోసారి. వంద కోట్లకు పైగా షేర్ సాధించినట్టు నిర్మాతలు చెప్పుకున్నారు కానీ వాస్తవానికి 90కి పైన కొంచెం ఎక్కువగా వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్. వీటికి ఎలాంటి అధికారిక ధృవీకరణలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం కానీ భీమ్లా నాయక్ స్మార్ట్ స్క్రీన్ మీద కూడా సంచలనం రేపడం ఖాయం.

ఇదంతా ముందుగానే నిర్ణయించుకున్న ప్లాన్. ఎందుకంటే 25న ఆర్ఆర్ఆర్ రాబోతోంది. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం మూవీ లవర్స్ దాని మేనియాలో మునిగిపోతారు. ఆల్రెడీ భీమ్లా నాయక్ థియేటర్లలో పూర్తిగా నెమ్మదించింది. రాధే శ్యామ్ కు ముందే ఫైనల్ రన్ దిశగా పరుగులు పెట్టింది. అది డిజాస్టర్ కావడంతో వీకెండ్స్ లో పవన్ కు కొంత వసూళ్లు దక్కాయి కానీ మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు. ఇప్పుడీ ప్రకటనతో పూర్తిగా ఎండ్ కు వచ్చినట్టే. భీమ్లా నాయకు జరిగిన బిజినెస్ కోణంలో చూసుకుంటే బ్లాక్ బస్టర్ అనలేం కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ 90 కోట్లను రాబట్టడం అంటే మాత్రం మాటలు కాదు. అది కూడా రీమేక్ నుంచి.

ఎలాగూ వచ్చే వారం ఉగాది ఉంది కాబట్టి భీమ్లా మీద ఆహా, హాట్ స్టార్ లు వ్యూస్ పరంగా భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాయి. దానికి తగ్గట్టే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ ఈగో డ్రామాకు త్రివిక్రమ్ సంభాషణలు హై లైట్ గా నిలిచాయి. తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలా రెండు ఓటిటిలకు ఇవ్వడం వరకు బాగానే ఉంది కానీ క్వాలిటీ విషయంలో పోలిక వస్తే మాత్రం హాట్ స్టార్ దే కొంత పై చేయిగా ఉండొచ్చు. ఎందుకంటే ఆహా మీద ఇప్పటికీ 4కె అప్ గ్రేడ్, డాల్బీ సౌండ్ లాంటి వాటిలో కామెంట్స్ ఉన్నాయి. మరి ఆ టైంకంతా వాటిని సరిచేసి బెస్ట్ అనిపించుకుంటారేమో చూడాలి

Also Read : James Movie Review : జేమ్స్ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి