iDreamPost

Bheemla Nayak / Bangarraju : వెనక్కి తగ్గుతున్న పవన్ కళ్యాణ్.. బరిలోకి బంగార్రాజు!

Bheemla Nayak / Bangarraju : వెనక్కి తగ్గుతున్న పవన్ కళ్యాణ్.. బరిలోకి బంగార్రాజు!

తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్. అందుకే మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదల చేయడానికి కూడా దర్శకనిర్మాతలు వెనకాడరు. ఇప్పుడంటే కరోనా పరిస్థితుల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు కానీ ఒకప్పుడు సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైననా అన్నింటినీ వరుసపెట్టి చూసేవాళ్ళు. దాదాపు అందరు హీరోలు దర్శక నిర్మాతలు కూడా ఈ సీజన్ లో సినిమా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు . వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాల సిద్ధంగా ఉన్నాయి. జనవరి ఏడో తారీఖున అందరికంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవుతుండగా 12వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రాణా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లానాయక్ 14వ తేదీన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాల విడుదలకు రంగం సిద్ధమైంది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ‘భీమ్లా నాయ‌క్‌’ లో రానా ద‌గ్గుబాటి కీలక పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకు స్టార్ రైట‌ర్, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తునారు. భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్‌పై చాలా వార్త‌లు వినిపించాయి. ముందుగా సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు. 13న సర్కారువారి పాట‌, 14 రాధేశ్యామ్‌, 15న బంగార్రాజు వ‌స్తున్న‌ట్లు నిర్ణ‌యించుకున్నారు.

అయితే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ న‌టించిన RRR రేసులోకి వ‌చ్చేయడంతో మ‌హేశ్ త‌న స‌ర్కారువారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1కి మార్చుకున్నాడు. అదే బాట‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న భీమ్లా నాయ‌క్‌ను జ‌న‌వ‌రి 12 నుంచి జ‌న‌వ‌రి 26కి మార్చుకుంటాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ భీమ్లా నాయ‌క్ నిర్మాత‌లు సంక్రాంతి రేసులోనే నిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. జ‌న‌వరి 12నే భీమ్లా నాయ‌క్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు గట్టి ప్ర‌క‌టనలే ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ సినిమా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. సినిమాలో నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా వెనక్కు తగ్గడంతో వాయిదా వేసుకుందామని అనకున్న బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు.

Also Read : RRR : 30 రోజుల RRR కౌంట్ డౌన్ షురూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి