iDreamPost

కరోనాపై పోరు.. భారతీ సిమెంట్స్‌ విరాళం

కరోనాపై పోరు.. భారతీ సిమెంట్స్‌ విరాళం

మానవాళి మనుగడకు పెను మప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ రోజు భారతీ సిమెంట్స్‌ ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఐదు కోట్ల 14 లక్షల 50 వేల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంస్థ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బాలాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు.

వ్యాపార సంస్థలు ఎవరికి వారు తమకు తోచిన విధంగా పీఎం కేర్, సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నాయి. టాటా గ్రూపు, విప్రో, రిలయన్స్‌ వంటి కార్పొరేటర్‌ సంస్థల నుంచి చిన్నా, పెద్దా ప్రైవేటు కంపెనీలు కరోనాపై పోరుకు తమ చేయూతను అందింస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పలు మేఘా ఇన్‌ఫ్రా, దివీస్‌ లేబోరేటరీస్‌ వంటి సంస్థలు విరాళాలు అందజేశాయి.

నాలుగు రోజుల క్రితం ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 13 ఉండగా నేడు ఆ సంఖ్య 132కు చేరింది. ఢిల్లీలో జమాత్‌ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొంతమందికి కరోనా వైరస్‌ సోకడంతో ఈ సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటికే పలువురికి పరీక్షలు చేయగా.. ఇంకా అనేక మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 20 చొప్పున కేసులు నమోదు కాగా అత్యల్ఫంగా కర్నూలులో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి