iDreamPost

భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుక..దగ్గర్నుంచి చూసే ఛాన్స్! వివరాలివే..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవం వేడుకను దగ్గర నుంచి చూసేందుకు చాలా మంది భక్తులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గుడ్ న్యూస్.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవం వేడుకను దగ్గర నుంచి చూసేందుకు చాలా మంది భక్తులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గుడ్ న్యూస్.

భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుక..దగ్గర్నుంచి చూసే ఛాన్స్! వివరాలివే..

హిందూవులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీరామ నవమి ఒకటి. ఏటా దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలానే ఈ ఏడాది కూడా శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హిందువులందరూ సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీన శ్రీరామ నవమి పండగ రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భద్రాచలంలో రామాలయంలో శ్రీరాములోరి కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకను దగ్గర నుంచి వీక్షించాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి ఓ శుభవార్త వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ పండగ అనగానే గుర్తుకు వచ్చేది భద్రాచలం. ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణంను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలానే ఏటాది కూడా ఏప్రిల్ 17న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం రామాలయంలో రాములోరి కల్యాణోత్సవ కోసం సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఇక శ్రీరాముడి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రి సిద్ధమయ్యారు. ఇక స్వామి కల్యాణ వేడుకను దగ్గర నుంచి చూడాలని చాలా మంది  భక్తులు కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు ఓ శుభవార్త చెప్పారు. సీతారాముల కల్యాణాన్ని  ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు టికెట్లను విక్రయిస్తున్నారు. వీటిని ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ గా కౌంటర్ల వద్ద కూడ విక్రయిస్తున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక టికెట్ ధరలు రూ.7,500, రూ.2,500, రూ.1000, రూ.300, రూ.150 గా ఉన్నాయి. ఈ టికెట్లను ఇప్పటికే ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ టికెట్లు కాకుండా మిథిలా మండపానికి సమీపంలో రామయ్య కల్యాణోత్సవ వేడుకను దగ్గర్నుంచి చూసేందుకు ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన టికెట్ ధరలు రూ.10,000, రూ.5,000గా నిర్ణయించారు. ఈ టికెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్ లో ఏప్రిల్ 13 శనివారం నుంచి విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన వివరించారు.

అదే విధంగా భక్తుల ఇంటి వద్దకే  స్వామివారి తలంబ్రాలు పంపిస్తామని ఆర్టీసీ, తపాలా శాఖలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ ద్వారా ఈ నెల 18 వరకు బుక్‌ చేసుకోవచ్చని  సదరు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల పరిధిలో 90 లాజిస్టిక్‌ కేంద్రాల్లో తలంబ్రాల బుకింగ్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలకు రూ.450 చెల్లించి ఈ నెల 15 లోపు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అలానే ముత్యాల తలంబ్రాలకు రూ.150 చెల్లించి ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని అన్ని పోస్టల్ ఆఫీసుల్లో చిరునామా తెలిపి.. బుక్‌ చేసుకోవచ్చునని అధికారులు ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి