iDreamPost

ఆత్మలతో ఇన్వెస్టిగేషన్.. OTTలో ఒక్కో సీన్ కు వణికి పోవాల్సిందే!

Best Suspense Thriller OTT Suggestions: మీరు ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్ చూశారా?

Best Suspense Thriller OTT Suggestions: మీరు ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేసే సిరీస్ చూశారా?

ఆత్మలతో ఇన్వెస్టిగేషన్.. OTTలో ఒక్కో సీన్ కు వణికి పోవాల్సిందే!

ఓటీటీలు వచ్చిన తర్వాత ఏ భాష చిత్రమైనా మనకు కావాల్సిన భాషలోకి వచ్చేస్తోంది. పైగా ఒరిజినల్స్ పేరిట ఓటీటీ సంస్థలే స్వయంగా సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నాయి. వాటిని దాదాపు అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వెబ్ సిరీస్ లకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాయి. అయితే మీరు ఇప్పటివరకు చాలామంచి సిరీస్లు చూసుంటారు. కానీ, ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ చేయడం చూశారా? హాలీవుడ్ రేంజ్ లో తీసిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను రెండేళ్లుగా అలరిస్తోంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు చూసి ఉంటారు. కానీ, ఇది మాత్రం కచ్చితంగా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సీరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పుడు చెప్పుకుంటోంది ది లాస్ట్ అవర్ అనే సూపర్ న్యాచురల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి. ఇది అమెజాన్ ప్రైమ్ లో 2021 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 30 నిమిషాలు ఉంటుంది. ఇప్పటికీ మీరు బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం చూస్తే ఇది సజీషన్స్ లోకి వస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.

పోలీసులకు దొరక్కుండా వరుస హత్యలు చేయడం, హంతకుడు ఎవరో తెలియక పోలీసులు జుట్టు పీక్కోవడం, ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకడం.. ఇలా సిరీస్ మొత్తం ఎంతో ఇన్టెన్స్ గా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ కి ఇన్వెస్టిగేషన్ స్పీడు పెంచడం, ఆత్మలతో మాట్లాడుతూ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం చూస్తే ఒక్కో సీన్ కి భయం కలుగుతుంది. ముఖ్యంగా లీడింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, హీరో మధ్య ఉండే సంభాషణలు కూడా మెప్పిస్తాయి. సంజయ్ కపూర్, కర్మ తకాపా, షేలీ కే లీడ్ రోల్స్ ప్లే చేయడం ఈ సిరీస్ కి ఎంతో ప్లస్ అనే చెప్పాలి. వీళ్ల నటన మీ వాచింగ్ ఎక్స్ పీరియన్స్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుంది. అయితే అక్కడక్కడ మాత్రం కాస్త ల్యాగ్ ఫీలవుతారు. కానీ, వెబ్ సిరీస్ అంటే ఆమాత్రం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కథ ఏంటంటే?:

అరుప్(సంజయ్ కపూర్) ముంబయిలో ఉండే పోలీసు అధికారి. అతడిని ఒక కేసు కోసం ఈశాన్య రాష్ట్రానికి బదిలీ చేస్తారు. ఒగ బెంగాలీ నటిని దారుణంగా రే*ప్ చేసి హత్య చేస్తారు. ఆ కేసు ఛేదించేందుకు అరుప్ వెళ్తాడు. అయితే అక్కడ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాళ్ల మోటో ఏంటో కూడా తెలియదు. అరుప్ తనకి సాయంగా ఉంటాడని ఇన్వెస్టిగేషన్ లోకి దేవ్(కర్మా తపాకా)ను తీసుకుంటాడు. దేవ్ కు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అతను ఆత్మలతో మాట్లాడగలడు. లోకాన్ని వీడకుండా ఇక్కడే తిరుగుతూ ఉండే ఆత్మలను దేవ్ తీరాలకు చేరుస్తు ఉంటాడు. ఈ హత్యలకు సంబంధించి ఆత్మలతో మాట్లాడుతూ వారిని ఎవరు హత్య చేశారో తెలుసుకునేందుకు దేవ్ ప్రయత్నిస్తాడు. అయితే హత్యలు చేస్తోంది కూడా ఒక సూపర్ న్యాచురల్ శక్తులు కలిగిన వాళ్లే అనే అనుమానాలు వస్తాయి. అసలు ఈ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు చంపుతున్నారు? ఈ కేసును అరుప్ ఛేదించాడా లేదా? అనేదే ది లాస్ట్ అవర్ సిరీస్ కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి