iDreamPost
android-app
ios-app

Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌

  • Published Jun 04, 2024 | 11:31 AMUpdated Jun 04, 2024 | 11:31 AM

గత కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి ఎద్దడితో బాధపడ్డ బెంగళూరు.. తాజాగా కురిసిన భారీ వర్షం కారణంగా 133 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. ఆవివరాలు..

గత కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి ఎద్దడితో బాధపడ్డ బెంగళూరు.. తాజాగా కురిసిన భారీ వర్షం కారణంగా 133 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. ఆవివరాలు..

  • Published Jun 04, 2024 | 11:31 AMUpdated Jun 04, 2024 | 11:31 AM
Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌

కొన్ని రోజుల క్రితం వరకు బెంగళూరు పేరు వినబడితే చాలు.. భయంకరమైన కరువు.. నీటి ఎద్దడి.. వాటర్‌ ట్యాంకర్‌ల కోసం పడిగాపులు కాస్తున్న జనాలు.. ఇవే సీన్లు కళ్ల ముందు దర్శనం ఇచ్చేవి. తీవ్రమైన నీటి కొరతతో బెంగళూరు వాసులు నానా ఇబ్బంది పడ్డారు. నీళ్ల కరువుతో జనాలు మాల్స్‌కు ఎగబడ్డంతో.. వారు ఫైన్‌లు విధించారు. ఇక చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని ప్రకటించాయి. బాబోయ్‌ ఒక్క వాన పడితే బాగుండు అనుకుంటున్న తరుణంలో బెంగళూరుకు చల్లని కబురు అందింది. గత కొన్ని రోజులుగా అక్కడ అడపాదడపా వానలు కురుస్తున్నాయి. ఇక తాజాగా అయితే బెంగళూరులో వరుణుడు రికార్డ్‌ బ్రేక్‌ చేశాడు. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా నీటి ఎద్దడితో అల్లాడిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని వరుణుడు కరుణించాడు. ఇన్నాళ్లు అనావృష్టితో బాధపడ్డ నగరవాసులకు చల్లని కబురు చెప్పాడు. బెంగళూరు నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 111 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సరికొత్త రికార్డ్‌ అంటున్నారు. జూన్‌ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే తొలిసారని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.

జూన్‌ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. దీంతో ఏటా జూన్‌ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3 ఎంఎం) ఇప్పటికే దాటేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలో చివరిసారి 1891 జూన్‌ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేశారు.

ఇటీవల కాలంలో బెంగళూరు.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో జల సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నీటివృథాపై అధికారులు జరిమానాలు సైతం విధించారు. అయితే గత కొన్ని రోజులుగా నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని, దక్షిణ కన్నడ, ఉడిపి, హవేరి, బళ్లారి, బెంగళూరు, మైసూరు తదితర జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి