iDreamPost

విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ బీభత్సం! బిచ్చగాళ్లుగా వచ్చి..

  • Published Mar 24, 2024 | 12:57 PMUpdated Mar 24, 2024 | 6:05 PM

సాధారణంగా యాచకులు అంటే దయవంచి అడక్కుని వచ్చిన దానితో బతుకు జీవనం సాగిస్తుంటారు. కానీ, తాజాగా ఓ బస్సు స్టాండ్ లో యాచకులు మద్యం సృష్టించిన వీరంగంతో అందరూ భయంద్రోళనతో పరుగులు తీశారు.

సాధారణంగా యాచకులు అంటే దయవంచి అడక్కుని వచ్చిన దానితో బతుకు జీవనం సాగిస్తుంటారు. కానీ, తాజాగా ఓ బస్సు స్టాండ్ లో యాచకులు మద్యం సృష్టించిన వీరంగంతో అందరూ భయంద్రోళనతో పరుగులు తీశారు.

  • Published Mar 24, 2024 | 12:57 PMUpdated Mar 24, 2024 | 6:05 PM
విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ బీభత్సం! బిచ్చగాళ్లుగా వచ్చి..

 

సాధారణంగా యాచకులు అంటే పేదరికం కారణంగా, ఆర్థిక స్థోమత లేక, తినడానికి కూడు కూడా లేని వారు ఇలా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇప్పటికే దేశంలో ఎక్కడ చూసిన యాచకులు అనే వారు అడుగడుగున దర్శనంమిస్తుంటారు. ముఖ్యంగా.. బస్సు స్టాండ్ ల్లో, రైళ్లలో దేవాలయాల్లో, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు, వికలాంగులు, వృద్ధులు వంటి వారు ప్రాదయపడుతూ.. డబ్బులు అడుగుతుంటారు. ఇక ప్రజలు కూడా జాలీ పడుతూ వారికి కొంత డబ్బును ఇవ్వడం, తినడానికి ఏమైనా ఇవ్వడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే బిక్షాటన అనేది రాను రాను ఓ వృత్తిలా మారిపోయింది. అయితే కొంత మంది ఈ యాచకుల రూపంలో డబ్బులు గడిస్తుంటే.. మరి కొందరు బిచ్చగాళ్లు మాత్రం మద్యనికి బానిసలై లేనిపోని ఆనార్ధలు సృష్టిస్తున్నారు. తాజాగా ఓ యాచకుల బ్యాచ్ బస్సు స్టాండ్ లో మద్యం మత్తుల సృష్టించిన వీరంగం అంత ఇంత కాదు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయంద్రోళనకు గురియ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

యాచకులంటే దయవంచి అడక్కుని వచ్చిన దానితో బతుకు జీవనం సాగిస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం బిక్షాటన ముసుగులో మద్యనికి బానిసలై లేనిపోని చర్యలకు పాల్పడుతూ వీరంగం సృష్టింస్తుంటారు. తాజాగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్‌ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ పెద్ద గందరగోళమే సృష్టించింది. అసలేం జరిగిందంటే.. మద్యంసేవించి ఉన్న కొంతమంది యాచకులు బస్టాండ్‌లోని బెంచీలు ఆక్రమించుకుని పడుకున్నారు. అయితే బస్టాండ్ లో ఉండే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండటంతో వారు వెంటనే ఫిర్యాదు చేయగా.. వారిని పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, బస్టాండ్‌లో పడుకున్న వారిని నిద్రలేపడానికి ప్రయత్నిస్తూన్న సిబ్బందిపై.. ఆ యాచకులు, బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ దాడి చేశారు. ఒక్కసారిగా పొలీసులపైకి దాడికి వచ్చినవారిలో వందమందికిపైగా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు ఉన్నారు. ఈ బ్లేడ్‌లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. వీరితో పాటు ఈ ఘటన దృశ్యలను చూసిన ప్రయాణికులు కూడా భయంద్రోళనకు గురై పరుగులు తీశారు.

అయితే వీరి దాడిలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయి. ఇక బస్టాండ్‌లోని ఆర్టీసీ విచారణ సిబ్బందిపై కూడా ఈ యాచకులు దాడికి ప్రయత్నించారు. దీంతో అదనపు పోలీసులు రావడంతో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు అంతా పరారయ్యారు. ఇక దాడికి పాల్పడిన వారిలో కొందరు బ్లేడ్ బ్యాచ్ యాచకులను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, బస్టాండ్ లో ఈ బ్లేడ్ బాచ్ యాచకులు సృష్టించిన ఘటన ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. మరి, యాచకుల ముసుగులో ఉన్న ఈ బ్లేడ్ బాచ్ సృష్టించిన వీరంగం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి