iDreamPost

IPL జట్లుకు BCCI స్ట్రాంగ్‌ వార్నింగ్‌! ఇ‍కపై అలా చేస్తే.. ఖతమే!

  • Published Apr 15, 2024 | 11:38 PMUpdated Apr 15, 2024 | 11:38 PM

BCCI, IPL 2024: ఐపీఎల్‌ 2024లో మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ.. ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఆ వార్నింగ్‌ ఎందుకో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

BCCI, IPL 2024: ఐపీఎల్‌ 2024లో మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ.. ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఆ వార్నింగ్‌ ఎందుకో ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 15, 2024 | 11:38 PMUpdated Apr 15, 2024 | 11:38 PM
IPL జట్లుకు BCCI స్ట్రాంగ్‌ వార్నింగ్‌! ఇ‍కపై అలా చేస్తే.. ఖతమే!

ఐపీఎల్‌ 2024లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతి మ్యాచ్‌ కూడా చివరి వరకు వెళ్తూ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని అందిస్తున్నాయి. ఎప్పుడు ఏ టీమ్‌ గెలుస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఒక వైపు ఐపీఎల్‌లో ఫుల్‌ జోష్‌లో సాగుతుంటే.. మరో వైపు బీసీసీఐ ఐపీఎల్‌ టీమ్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై మైదానంలో ఉన్నప్పుడు మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదని బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ టీమ్‌ అయినా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ హెచ్చరించినట్లు సమాచారం. కేవలం ఐపీఎల్‌ టీమ్స్‌కే కాకుండా కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఆయా టీమ్స్‌ సోషల్‌ మీడియా టీమ్స్‌ను ఉద్దేశించి బీసీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎల్‌ ప్రసార హక్కుల కోసం బ్రాడ్‌ కాస్టర్లు, బోర్డుకు భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నారు. ఇంత భారీ బిజినెస్‌కు కొంతమంది ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వారికి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కో సారి కొంతమంది కామెంటేటర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చేస్తున్నప్పుడు గ్రౌండ్‌లో ఉన్నప్పుడు లైవ్‌ మ్యాచ్‌ అప్‌డేట్స్‌ మాత్రమే సోషల్‌ మీడియోలో పోస్ట్‌ చేయాలి. కానీ, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. వారికి, అలాగే ఆయా ఫ్రాంచైజీలకు భారీ జరిమానా విధిస్తారు. ఇటీవల కొంతమంది ‍ప్లేయర్లు మ్యాచ్‌ డేకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. వీటిని వెంటనే తొలగించాలని కూడా సదరు ఆటగాళ్లకు బీసీసీఐ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతుండటంతో క్రికెట్‌ అభిమానులంతా ప్రతి మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. వారికి సోషల్‌ మీడియాలో అప్డేట్స్‌ దొరకపోతే.. వాళ్లు నేరుగా జియో యాప్‌లో లేడా స్టార్‌ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ చూస్తున్నారు. కానీ, సోషల్‌ మీడియాలో అప్డేట్స్‌ దొరుకుతుండటంతో తమ వ్యూవర్‌ షిప్‌ తగ్గిపోతుందని సదరు బ్రాడ్‌ కాస్ట్‌ సంస్థలు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు అలాగే ఆటగాళ్లకు, కామెంటేటర్లకు సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే..ఐపీఎల్‌ 2023 నుంచి 2027 వరకు ప్రసార హక్కుల కోసం స్టార్‌ ఇండియా రూ.23,575 కోట్లు, అలాగే జియో యాప్‌(వయాకామ్‌) రూ.20,500 కోట్లను బీసీసీఐకి చెల్లించింది. ఇంత భారీ ధర పెట్టి ప్రసార హక్కులు కొన్న కంపెనీలకు ఇబ్బందులోస్తే పరిష్కరించడం బీసీసీఐ విధి. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి