iDreamPost
android-app
ios-app

Barrelakka: బర్రెలక్క పెళ్లికి ముహుర్తం ఫిక్స్.. పెళ్లి కార్డు వైరల్

సోషల్ మీడియా స్టార్, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా స్టార్, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.

Barrelakka: బర్రెలక్క పెళ్లికి ముహుర్తం ఫిక్స్.. పెళ్లి కార్డు వైరల్

సోషల్ మీడియా సెన్సేషన్, యువతను ఆలోచింప చేసిన ఇన్ఫ్లుయెన్సర్ బర్రెలక్క అలియాస్ శిరీష.. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ ఫేమస్ అయిన సంగతి విదితమే. ‘బర్రెలు కాయడానికి వచ్చినా ఫ్రెండ్స్. ఎంత చదివినా గానీ.. డిగ్రీలు డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప.. జాబులైతే వస్తలేవ్. నోటిఫికేషన్లు రావు. అందుకే మా అమ్మను అడిగి.. ఈ బర్రెలు కొన్నా’ అంటూ ఓ వీడియోతో వైరల్ అయ్యింది శిరీష. అక్కడితో ఆగిపోలేదు ఆమె.. నిరుద్యోగ గొంతుకగా మారి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సెన్సేషనల్‌గా మారింది. తన సోదరుడిపై దాడి జరిగినా, బెదిరింపులు ఎదురైనా కూడా భయపడినప్పటికీ.. వెనుకంజ వేయలేదు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. మరింత ఆత్మ స్థైర్యాన్ని పోగోసుకుని.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పింది.

ఇప్పుడు ఈ అక్క.. పెళ్లి పీటలు ఎక్కబోతుంది. సోషల్ మీడియాలో వరుసగా పెళ్లికి సంబంధించిన వీడియోలు పెడుతూ మరోసారి నెట్టింట్లో హల్ చల్ సాగిస్తోంది. అయితే వరుడు ఎవరు అన్నది ప్రకటించలేదు. అయితే యూట్యూబ్, ఇన్ స్టాలో తన పెళ్లికి సంబంధించిన ప్రతి వీడియోను షేర్ చేస్తోంది. పెళ్లి చూపులు వీడియో, నిశ్చితార్థం వీడియో, కట్న కానులు మాట్లాడుకున్న వీడియో, ఫ్రెండ్స్‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. అలాగే షాపింగ్, బ్యూటీ పార్లర్ వీడియోస్ షేర్ చేసుకుంది. అయితే బర్రెలక్క కాబోయే వరుడు ఎవరు, అతడి పేరు కూడా రివీల్ చేయలేదు. కాగా, ఇప్పుడు బర్రెలక్క వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతుంది.  ఆమెనే స్వయంగా పెళ్లి  కార్డు పోస్టు చేసింది.

మార్చి 28న శిరీష వివాహం జరగబోతుంది. ఇంతకు ఆ వరుడు ఎవరంటే. . వెంకటేష్ అట. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం, తెల్క పల్లి మండలం మారెడు బాలకిష్ణయ్య, బక్కమ్మ సంతామని సమాచారం. ఇదే నిజమైతే.. రానున్న గురువారమే.. శిరీషను వెంకటేష్ అనే వ్యక్తిని మనువాడబోతుంది. కాగా, బర్రెలక్కపై గతంలో పలు రూమర్లు వచ్చాయి. ఆమెకు గతంలో పెళ్లి అయ్యిందని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులకే విడాకులు దారి తీసినట్లు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి పల్లవి ప్రశాంత్‌ను వివాహం చేసుకోబోతుందంటూ న్యూస్ రాగా, ఖండించింది శిరీష. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అతడి ఫేస్ రివీల్ చేయడం లేదని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన నిరుపేద అయిన బర్రెలక్క.. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.  పెద్ద కొత్తపల్లిలో ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Barrelakka Siri (@princes_siri_barrela

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet