iDreamPost

బిగ్‌ అలర్ట్‌.. ఇకపై బ్యాంక్‌లు వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తాయి!

  • Published Jul 22, 2023 | 1:49 PMUpdated Jul 22, 2023 | 1:49 PM
  • Published Jul 22, 2023 | 1:49 PMUpdated Jul 22, 2023 | 1:49 PM
బిగ్‌ అలర్ట్‌.. ఇకపై బ్యాంక్‌లు వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తాయి!

తక్కువ పని దినాలు.. ఎక్కువ పని గంటలు అనే ఆచరణ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ విధానం కేవలం సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే తర్వలోనే బ్యాంకుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారా. ఈ మేరకు ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌(ఐబీఏ).. కేంద్రానికి ప్రతి పాదనలు పంపింది. అయితే పని దినాలు తగ్గిస్తే.. ఆమేరకు అధిక గంటలు పని చేయాలని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్స్‌(యూబీఎఫ్‌ఏ)తో చర్చించేందుకు గాను ఐబీఏ జూలై 28 న సమావేశం కానుంది.

ఇప్పటికే ఎల్‌ఐసీ ఉద్యోగుల పని దినాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వారి పని దినాలను 5 రోజులుగా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఎల్‌ఐసీ బాటలోనే బ్యాంకులకు కూడా ఇదే విధానం అమలు చేయాలని యూబీఎఫ్‌ఏ కోరింది. దీంతో పాటు బ్యాంక్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ తదితర అంశాలపై కూడా చర్చించింది. బ్యాంక్‌ వర్కింగ్‌ డేస్‌ను వారానికి 5 రోజులుగా చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే వారానికి 5 రోజుల పనిదినాలు అమల్లోకి వస్తే.. రోజులో కొంత ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. అంటే ఒక రోజు తగ్గితే.. అప్పుడు బ్యాంక్‌ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అధికంగా పని చేయాల్సి వస్తుంది. బ్యాంక్ వర్కింగ్ డేస్‌ను 5 రోజులకు పరిమితం చేయలని బ్యాంకింగ్ యూనియన్స్ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌గా ఉంది. తాజాగా ఈ విధానాన్ని ఎల్‌ఐసీలో అమలు చేస్తుండటంతో.. మరోసారి బ్యాంక్ పనిదినాల అంశం కూడా తెరపైకి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి