iDreamPost

ఈ రూల్స్ అతిక్రమిస్తే బ్యాంకులే మనకి ఫైన్స్ కట్టాలి.

  • Published Feb 17, 2024 | 6:58 PMUpdated Feb 17, 2024 | 6:58 PM

సాధారణంగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు.. పెనాల్టీ చెల్లించే ఉంటారు. ఇవన్నీ చాలా కామన్ . కానీ, బ్యాంకులు తప్పులు చేస్తే.. వారు కూడా పెనాల్టీ చెల్లించాలని ఎంతమందికి తెలుసు! దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇప్పుడు అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలో డెబిట్ కార్డ్స్ తో పాటు.. ఈ మధ్య అందరు క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్స్ ను వినియోగిస్తునే ఉన్నారు. అయితే, ఈ క్రెడిట్ కార్డు బిల్స్ ను ఆన్ టైం లో క్లియర్ చేసేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ, కాస్త ఆలస్యం అయినా కూడా వీటిపై పెనాల్టీ చార్జెస్ పెరిగిపోతూ ఉంటాయి. పైగా ఒక్కోసారి ఎక్స్ట్రా చార్జెస్ ను కూడా వేస్తూ ఉంటారు. కానీ, ఒక్కోసారి బ్యాంకులు కూడా కస్టమర్ల పట్ల నిర్లక్ష్యత వహిస్తూ ఉంటాయి. అప్పుడు బ్యాంకు వారు కూడా కస్టమర్లకు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని మాత్రం ఎవరికి తెలియదు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే , క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించి ఎటువంటి డ్యూస్ లేకుండా.. మెంటైన్ చేస్తూ, ఇక వద్దు అనుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ ను క్లోజ్ చేయాలని అనుకున్నపుడు.. దానికి సంబంధించిన బ్యాంకును సంప్రదించాలి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు ఈ విషయాన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ తగ్గిపొతుందని భావిస్తారు. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం .. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన వారం రోజుల లోపు.. సంబంధిత బ్యాంక్ దానికి రెస్పాండ్ కాకపోతే.. అప్పుడు ఆ కస్టమర్ ఆ బ్యాంక్ పై కేసు వేయొచ్చు. అలా కేసు వేయడం వలన రోజుకు రూ. 500 చొప్పున నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి .. బ్యాంక్ వారు ఆ కస్టమర్ కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మన తప్పులతో పాటు.. బ్యాంక్ తప్పులను కూడా గుర్తించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి