iDreamPost

బ్యాంకుల్లో పని ఉందా.. అయితే త్వరపడండి.. వరుసగా సెలవులు

  • Published Apr 08, 2024 | 9:56 AMUpdated Apr 08, 2024 | 9:56 AM

Bank Holidays: ఈ వారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఎందుకంటే..

Bank Holidays: ఈ వారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఎందుకంటే..

  • Published Apr 08, 2024 | 9:56 AMUpdated Apr 08, 2024 | 9:56 AM
బ్యాంకుల్లో పని ఉందా.. అయితే త్వరపడండి.. వరుసగా సెలవులు

మీకు ఈ వారంలో బ్యాంకులకు వెళ్లే ముఖ్యమైన పనులు ఉన్నాయా.. వారాంతంలో చూసుకోవచ్చు అని బిందాస్ గా ఉన్నారా.. అయితే త్వరపడండి. ఎందుకంటే ఈ వారంలో బ్యాంకలుకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. అసలు ఏప్రిల్ నెలలోనే బ్యాంకులకు సగం రోజులు సెలవులు ఉండగా.. ఈ వారం ఏకంగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక మీకు బ్యాంకులకు వెళ్లే ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. త్వరగా వెళ్లి ఆ పనులు చూసుకొండి. మరి ఈ వారంలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో.. ఎందుకు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో చాలా పండగలే ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిసి ఈ నెల బ్యాంకులకు మొత్తంగా దాదాపు 14 రోజుల వరకు సెలవులు వచ్చాయి. ఇందులోనే రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారం బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. ఎప్పుడంటే..

4 days bank holiday

ఏప్రిల్ 9న (మంగళవారం) దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. కారణం ఉగాది పండుగ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో.. వేర్వేరు పేర్లతో ఉగాది పండుగ జరుపుకుంటారు. కనుక ఏప్రిల్ 9, మంగళవారం నాడు బ్యాంకులకు లంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మణిపుర్, గోవా, జమ్మూ, శ్రీనగర్‌లో సెలవు ఉంది.

చాలా రాష్ట్రాల్లో ఈ వారంలో బ్యాంకులు కేవలం 3 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఏప్రిల్ 11న గురువారం రంజాన్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీనికి తోడు ఏప్రిల్ 13న ఈ నెలలో రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత ఏప్రిల్ 14 ఆదివారం సెలవు. అంటే ఈ వారంలో బ్యాంకులు పని చేసేది ఏప్రిల్ 8 (సోమవారం), ఏప్రిల్ 10 (బుధవారం), ఏప్రిల్ 12 (శుక్రవారం) 3 రోజులు మాత్రమే అన్నమాట.

ఇక ఏప్రిల్‌లో ఇతర సెలవుల విషయానికి వస్తే శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 16న (మంగళవారం) దాదాపు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే ఉంది. అయితే ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నప్పటికీ.. కస్టమర్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులోనే ఉంటాయి. ఇంకా ఏటీఎంలు, డిపాజిట్ మెషీన్లు కూడా పనిచేస్తాయి. చిన్న చిన్న పనులు ఉంటే వీటిని ఉపయోగించుకోవచ్చు. కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే మాత్రం సెలవు రోజు లేకుండా చూసుకుని వెళ్లి పని ముగించుకుని రావాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి