iDreamPost

జుంబా డాన్స్ తో చిందేసిన బెంగుళూరు పోలీసులు

జుంబా డాన్స్ తో చిందేసిన బెంగుళూరు పోలీసులు

పోలీసులంటే ప్రజలకు రక్షణ ఇస్తూ, నేరాలు జరగకుండా కాపు కాస్తూ, నేరస్తులను వలవేసి పట్టుకుంటారనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో వారిపై పని ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం.. ఆ పని ఒత్తిడిని అధిగమించడానికి బెంగుళూరు పోలీసులు జుంబా డాన్స్ తో అదరగొట్టారు..

పనిలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత ఈస్ట్ డివిజన్ కు చెందిన పోలీసులకు ఈ క్యాంపు నిర్వహించారు. బెంగుళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఆదేశాల మేరకు 1000 మంది పోలీసులు శాండల్ వుడ్ పాటలకు ఉత్సాహంగా కాళ్ళు కదుపుతూ జుంబా డాన్స్ తో అలరించారు.

స్ట్రెస్ రిలీఫ్, ఫ్యాట్ బర్నింగ్ కోసం పోలీసులు చేసిన ఈ జుంబా నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మహిళా పోలీసులు కూడా జుంబా డాన్స్ తో అదరగొట్టారు. పోలీసులకు ఎదురవుతున్న పని ఒత్తిడిని దూరం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ భాస్కర్ రావు వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోలీసుల డాన్స్ వీడియో చక్కర్లు కొడుతుంది ..పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలోనే కాదు, డాన్స్ తో కూడా అదరగొడతారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి