iDreamPost

కర్నూల్ నర్సు ఫోటో ప్రచారం రివర్సు కొట్టింది

కర్నూల్ నర్సు ఫోటో ప్రచారం రివర్సు కొట్టింది

కర్నూలు వైసిపి ఎంఎల్ఏ హఫీజ్ ఖాన్ పై తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం రివర్సు కొట్టింది. కర్నూలులో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోవటానికి ఎంఎల్ఏనే కారణమని టిడిపి, బిజెపి నేతలు చేస్తున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే హఫీజ్ ఖాన్ పై మరో ప్రచారం మొదలైంది. ఓ ఆసుపత్రిలో ఒక హిందూ నర్సుతో ముస్లిం మాట గురువు కాళ్ళను ఎంఎల్ఏ పట్టించాడని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు . ఆ ఫొటోలో ఏముందంటే ఓ ముస్లిం పెద్దాయన నిలబడుంటే ఓ నర్సు ఆయన ఎడమ కాలును తుడుస్తోంది.

మామూలుగా చూస్తే నర్సు పెద్దాయాన పాదం పట్టుకునున్నట్లే కనబడుతుంది. దాన్నే ఫొటోగా తీసి వాట్సప్, ఫేస్ బుక్ లో టిడిపితెగ ప్రచారం చేస్తున్నారు. ఫొటోలు ఎంఎల్ఏ కూడా ఉండటంతో ప్రచారానికి బాగా మసాలా కూడా దట్టించారు. కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించే రోజులు పోయి దశాబ్దాలు గడిచాయి. ఈ రోజుల్లో ఏ అధికారికాని రాజకీయా నాయకుడు కానీ ఎవరినైనా కాళ్ళు పట్టుకోమని చెప్పే ధైర్యం కూడా చేయలేరు. ఆ పెద్దాయన కాలికి గేటు తగలటంతో అయినా గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసిందంతే. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఈ ఫొటోను తనకు కావాల్సినట్లుగా ప్రచారంలోకి తెచ్చాడు. ఆ ఫోటోను ప్రధాని మోడీని ట్యాగ్ చేసి ట్విట్టర్లో కూడా పెట్టాడు. దీనితో ఆ ఫొటో బాగా వైరల్ అయిపోయింది. ఇదే విషయం చివరకు ఎంఎల్ఏకు కూడా చేరింది.

దాంతో హఫీజ్ సోషల్ మీడియాపై మండిపోయాడు. వాస్తవాలను కప్పిపెట్టి తనకు వ్యతిరేకంగా తమకు కావాల్సినట్లుగా టిడిపి, బిజెపి నేతలు ప్రచారం చేసుకోవటంపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంతకీ విషయం ఏమిటంటే రాయలసీమ యూనివర్సిటిలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. దాన్ని ఎంఎల్ఏ సందర్శించాడు. ఆ సమయంలో ఓ పెద్దాయన హఫీజ్ దగ్గరకు వచ్చినపుడు కాలికి గేటు తగలటంతో గాయలమైంది. అయనకు షుగర్ సమస్య ఉందట. దాంతో వెంటనే రక్తం కారటం మొదలైంది.

సరే ఎలాగూ డాక్టర్లు, నర్సులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఓ నర్సు వచ్చి దెబ్బను శుభ్రం చేసి గాయానికి కట్టుకట్టింది. దెబ్బను శుభ్రం చేసి కట్టు కట్టేటపుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని ఎంఎల్ఏ ప్రత్యర్ధులు తమిష్టానికి కామెంట్లు జత చేసి నెగిటివ్ ప్రచారం చేశారు. ట్విట్టర్లో పెట్టిన వ్యక్తి దాన్ని తరువాత తొలగించాడు కానీ ఇప్పుడు పోలీస్ కేసు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇలాంటి వాటిని చూసే ’నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది’ అనే సామెత పుట్టుకొచ్చిందేమో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి