iDreamPost

ఇండియా ఆతిథ్యంపై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ కామెంట్స్ వైరల్!

  • Published Oct 04, 2023 | 4:13 PMUpdated Oct 04, 2023 | 4:13 PM
  • Published Oct 04, 2023 | 4:13 PMUpdated Oct 04, 2023 | 4:13 PM
ఇండియా ఆతిథ్యంపై పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ కామెంట్స్ వైరల్!

వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం రేపటి నుంచి ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో కొన్ని టీమ్స్‌ హాట్‌ ఫేవరేట్లుగా ఉన్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్‌ సైతం వరల్డ్‌ కప్‌ రేసులో ముందు ఉందని చాలా మంది క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. అయితే.. పాకిస్థాన్‌ టీమ్‌ చాలా కాలంగా ఇండియాకు రాలేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే.. ఈ సారి వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటంతో.. పాకిస్థాన్‌ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.

అయితే.. పాకిస్థాన్‌ జట్టుకు ఎవరూ ఊహించని రీతిలో భారత్‌లో ఘనస్వాగతం లభించింది. వరల్డ్‌ కప్‌ కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో గల శంషాదాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో పాక్‌ జట్టు ల్యాండ్‌ అయింది. కాగా, పాక్‌ టీమ్‌కు ఎయిర్‌ పోర్టులో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. ఊహించని ఈ వెల్‌కమ్‌తో పాక్‌ ఆటగాళ్లు సైతం షాక్‌ అయ్యారు. తమను ఇండియాలో కూడా ఇంతలా అభిమానిస్తారా? అంటూ క్రికెట్ అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయారు. అలాగే బీసీసీఐ పాకిస్థాన్‌ క్రికెటర్లకు పార్క్‌ హయాత్‌ హోటల్‌లో అందించిన సౌకార్యాలకు కూడా పాకిస్థాన్‌ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని తాజాగా వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ఒక రోజు ముందు జరిగిన కెప్టెన్ల మీటింగ్‌లో కామెంటేటర్‌ రవిశాస్త్రి పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ను అడిగారు. ఇండియాలో మీకు లభించిన స్వాగతంతో పాటు, ఏర్పాట్ల గురించి చెప్పమని అడిగారు. దీనిపై బాబర్‌ బదులిస్తూ.. ఇండియాలో తమ అద్భుతమైన స్వాగతం లభించిందని, వారం రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని, తమకు ఇండియాలో కాకుండా తమ ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలిగిందని అన్నారు. తమ హోమ్‌లా ఫీల్‌ అయ్యామని అన్నాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ నుంచి ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వేదికగా వైరల్‌ అవుతున్నాయి. మరి బాబర్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మధ్య సరికొత్త సిరీస్‌కు ప్లానింగ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి