iDreamPost

వీడియో: మ్యాచ్‌కి ముందు బుమ్రాను బాబర్‌ ఎలా హేళన చేశాడో చూడండి!

  • Published Jun 11, 2024 | 12:12 PMUpdated Jun 11, 2024 | 12:12 PM

Babar Azam, Jasprit Bumrah, Ramiz Raja, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ముందు బుమ్రాపై బాబర్‌ ఆజమ్‌ జోకులు వేస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాడు. కానీ, మ్యాచ్‌లో మాత్రం బుమ్రా చేతిలోనే అవుటై.. నవ్వులపాలయ్యాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Babar Azam, Jasprit Bumrah, Ramiz Raja, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ముందు బుమ్రాపై బాబర్‌ ఆజమ్‌ జోకులు వేస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాడు. కానీ, మ్యాచ్‌లో మాత్రం బుమ్రా చేతిలోనే అవుటై.. నవ్వులపాలయ్యాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 11, 2024 | 12:12 PMUpdated Jun 11, 2024 | 12:12 PM
వీడియో: మ్యాచ్‌కి ముందు బుమ్రాను బాబర్‌ ఎలా హేళన చేశాడో చూడండి!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. పిచ్‌ పరిస్థితులు, టాస్‌ ఇలా అన్ని విషయాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నా కూడా టీమిండియా బౌలర్ల ముందు తలొంచింది పాకిస్థాన్‌. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 119 పరుగులకు ఆలౌట్‌ అయినా కూడా పాక్‌ మ్యాచ్‌ గెలవలేకపోయింది. 120 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక చేతులెత్తేసిన పాక్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చేసిన ఓవర్‌ యాక్షన్‌ వీడియోలు కూడా తాజాగా బయటికి వస్తున్నాయి. మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్‌ బౌలర్‌ బుమ్రాపై జోకులేసిన బాబర్‌.. మ్యాచ్‌లో మాత్రం అదే బుమ్రా చేతిలో జోకర్‌ అయ్యాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండియాతో మ్యాచ్‌కి కొన్ని రోజుల ముందు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా కూడా పాల్గొన్నాడు. ఆ సందర్భంలో.. టీ20 వరల్డ్‌ కప్ 2024లో న్యూయార్క్‌ వేదికగా జరగబోయే ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడుకుందాం అంటూ రమీజ్‌ రజా ఓ టాపిక్‌ను తీస్తాడు. అదేంటంటే.. మ్యాచ్‌లో ఎదురుగా బుమ్రా బౌలింగ్‌ వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్న క్రమంలో.. స్ట్రైక్‌లో ఉన్న బాబర్‌ ఆజమ్‌ మైండ్‌లో ఏం రన్‌ అవుతుంది, అతను ఏం ఆలోచిస్తూ ఉంటాడు అని రమీజ్‌ రజా, బాబర్‌ ఆజమ్‌ను అడిగాడు. ముందుగా బలంగా ఊపిరి తీసుకుంటాడా బాబర్‌.. అని చెప్పగా.. అది బుమ్రా తీసుకుంటాడు అంటూ బాబర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. అలాగే నీ కోసం రెండు స్లిపులు కూడా పెట్టి ఉంటాడు అని రమీజ్‌ రజా చెప్పగా.. మిడ్‌ వికెట్‌లో కచ్చితంగా పెట్టడు అంటూ బాబర్‌ ఆజమ్‌ జోకులు వేశాడు. తాను అద్భుతమైన కవర్‌ డ్రైవ్స్‌ ఆడతాను కాబట్టి.. మిడ్‌ వికెట్‌ వైపు ఫీల్డర్లు లేకుండా స్లిప్‌, కవర్స్‌లో ఫీల్డర్లు పెట్టుకుంటారని బాబర్‌ అర్థం.

Babar Azam Comments on Bumrah

ఇలా మ్యాచ్‌కి ముందు బుమ్రాపై జోకులు వేసిన బాబర్‌ ఆజమ్‌.. మ్యాచ్‌లో మాత్రం అదే బుమ్రా చేతిలో అవుట్‌ అయి జోకర్‌గా మారాడు. 13 బంతుల్లో కేవలం 13 పరుగులు చేసి.. స్లిప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. బుమ్రా వేసిన బాల్‌ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన బాబర్‌.. ఆ బాల్‌ను అస్సలు ఆడలేకపోయాడు. బాల్‌ వచ్చి బ్యాట్‌కు తాకి వెళ్లి సూర్య చేతుల్లో పడింది. ఏం జరిగిందో కూడా బాబర్‌కు సరిగా అర్థం కాలేదు. బుమ్రా అంటే ఏదో నార్మల్‌ బౌలర్‌ అనుకుని జోకులు వేశాడు బాబర్‌. కానీ, మ్యాచ్‌లో అతను ఎదురుగా వస్తుంటే.. బాబర్‌ గుండె ప్యాంట్‌ జేబుల్లోకి జారిపోయి ఉంటుంది అంటూ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి మ్యాచ్‌కి ముందు బుమ్రాపై జోకులు వేసి నవ్వుకుని, మ్యాచ్‌లో మాత్రం బుమ్రా చేతిలో జోకర్‌గా మిగిలి నవ్వుల పాలైన బాబర్‌ ఆజమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి