iDreamPost

మరో తిరుమలను తలపిస్తోన్న అయోధ్య.. తొలి రోజే కోట్ల రూపాయల విరాళం.. లక్షల్లో భక్తులు

  • Published Jan 25, 2024 | 10:50 AMUpdated Jan 25, 2024 | 10:50 AM

Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్యులకు కూడా అయోధ్య బాలరాముడి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజే లక్షల్లో భక్తులు, కోట్ల రూపాయల విరాళం వచ్చినట్లు అధికారలు తెలిపారు. ఆ వివరాలు..

Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్యులకు కూడా అయోధ్య బాలరాముడి దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజే లక్షల్లో భక్తులు, కోట్ల రూపాయల విరాళం వచ్చినట్లు అధికారలు తెలిపారు. ఆ వివరాలు..

  • Published Jan 25, 2024 | 10:50 AMUpdated Jan 25, 2024 | 10:50 AM
మరో తిరుమలను తలపిస్తోన్న అయోధ్య.. తొలి రోజే కోట్ల రూపాయల విరాళం.. లక్షల్లో భక్తులు

సుమారు ఐదు వందల ఏళ్ల నిరీక్షిణ తర్వాత.. తన జన్మ భూమికి చేరుకున్నాడు.. అయోధ్య రామయ్య. జనవరి 22, సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ వేడుక నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండగ వాతావారణం నెలకొంది. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుక పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదటి రోజు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే బాలరాముడి దర్శనానికి అవకాశం కల్పించారు.

ఆ మరుసటి రోజు నుంచే అనగా.. జనవరి 23, మంగళవారం నుంచి సామాన్యులకు దర్శన అవకాశం కల్పించారు. తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.. అంతేకాక కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు. తిరమలకు భక్తులు ఎలా పోటెత్తుతారో అలానే బాలరాముడి దర్శనం కోసం రావడమే కాక.. పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. ఆ వివరాలు..

Donation of crores of rupees to Bala Ram on the first day

ప్రాణప్రతిష్ట కార్యక్రమం తరువాత రోజు నుంచి సామాన్యులకు కూడా అయోధ్య బాల రాముడిని దర్శించుకునే అవకాశం ఇచ్చారు ఆలయ నిర్వాహకులు. అంతేకాక భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసారు. అలాగే ఆలయానికి రాలేకపోయిన వారు.. ఆన్‌లైన్‌లో విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇలా ఆలయ కౌంటర్ల, ఆన్‌లైన్‌ ద్వారా మొదటిరోజే బాలరాముడికి రూ.3.17 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.

అంతేకాక తొలిరోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముడిని భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఇక రెండోరోజు(బుధవారం) 2.5 లక్షల మంది రామయ్యను దర్శించుకున్నట్లు తెలిపారు.

భక్తుల తాకిడి ఎక్కువగా వుండటంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ముందుగా ఉదయం 7 గంటల నుండి 11.30 వరకు…. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు దర్శన వేళలుగా నిర్ణయించారు. కానీ భక్తుల రద్దీ భారీగా ఉండటంతో.. ఉదయం 6 గంటలకే ఆలయాన్ని తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు. దాంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. గడ్డకట్టించే చలిని సైతం లెక్క చేయకుండా.. క్యూలైన్లలో నిల్చుంటున్నారు. రాత్రి ఆలయం మూసివేసేవరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతోంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన మరుసటి రోజే బాల రాముడు కోటీశ్వరుడు కావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి