iDreamPost

యాక్సిస్ బ్యాంక్‌కు RBI షాక్.. ఏకంగా రూ. 90.92 లక్షల జరిమానా !ఎందుకంటే?

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి వాటి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆర్బీఐ భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంకుకు భారీగా జరిమానా విధించింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి వాటి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆర్బీఐ భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంకుకు భారీగా జరిమానా విధించింది.

యాక్సిస్ బ్యాంక్‌కు RBI షాక్.. ఏకంగా రూ. 90.92 లక్షల జరిమానా !ఎందుకంటే?

దేశంలోని పలు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. నిబంధనలను పాటించని బ్యాంకులకు భారీగా జరిమానాలను విధిస్తూ షాకిస్తోంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకుల లైసెన్స్ లను కూడా రద్దు చేస్తోంది. తాజాగా ఆర్బీఐ ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకుకు ఊహించని షాక్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు వివరణతో సంతృప్తి చెందని రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 90.92 లక్షల జరిమానాను విధించింది. కాగా బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు లోబడి కస్టమర్లకు సేవలందించాల్సి ఉంటుంది. నియమాలను ఉల్లంఘిస్తే ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ నో యువర్ కస్టమర్ నిబంధనలను పాటించనందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. కొంతమంది ఖాతాదారుల గుర్తింపు మరియు చిరునామా వివరాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించడంలో బ్యాంక్ విఫలమైందని చెప్పింది. కేవైసీకి సంబంధించిన 2016 మార్గదర్శకాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్‌పై ఆర్బీఐ రూ. 90.92 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించింది.

ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన కొంతమంది రికవరీ ఏజెంట్లు రుణం తీసుకున్న ఖాతాదారుల నుంచి లోన్స్ రికవరీ చేసేటప్పుడు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదని రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంకుకు ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించిన బ్యాంక్ దీనికి బ్యాంక్ వివరణ ఇచ్చుకుంది. యాక్సిస్ బ్యాంక్ తో ఏకీభవించని ఆర్బీఐ భారీ జరిమానాను విధించింది. ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఇటీవల గోల్డ్ లోన్ అందించే మణప్పురం ఫైనాన్స్‌, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి