iDreamPost

Titanic-2 : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టైటానిక్ షిప్ మళ్ళీ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే!

  • Published Mar 16, 2024 | 4:07 PMUpdated Mar 16, 2024 | 4:07 PM

టైటానిక్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది.. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన టైటానిక్ సినిమా. ఇది ఒక రియల్ స్టోరీ అని అందరికి తెలుసు. మంచు గడ్డను ఢీకొట్టి ఆ షిప్ మునిగిపోవడం స్టోరీ గురించి అందరికి తెలుసు. అయితే, ఇప్పుడు టైటానిక్ మళ్ళీ వచ్చేస్తుందట.

టైటానిక్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది.. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన టైటానిక్ సినిమా. ఇది ఒక రియల్ స్టోరీ అని అందరికి తెలుసు. మంచు గడ్డను ఢీకొట్టి ఆ షిప్ మునిగిపోవడం స్టోరీ గురించి అందరికి తెలుసు. అయితే, ఇప్పుడు టైటానిక్ మళ్ళీ వచ్చేస్తుందట.

  • Published Mar 16, 2024 | 4:07 PMUpdated Mar 16, 2024 | 4:07 PM
Titanic-2 : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టైటానిక్ షిప్ మళ్ళీ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే!

టైటానిక్ షిప్ సముద్ర గర్భంలో మునిగిపోయి 112 ఏళ్ళు పూర్తయింది. అయినా కూడా ఇప్పటికి ఈ పేరును తలుచుకుంటూనే ఉన్నారు. 1912 లో టైటానిక్ అంటే అందరికి ఓ అందమైన నావ. అది మునిగిపోయి ఇప్పటికి వంద సంవత్సరాలు దాటిపోయింది. కానీ, ఈ నావ గొప్పతనం మాత్రం ఎప్పటికి చెదిరిపోకుండా ఇంకా అలానే ఉంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన టైటానిక్ సినిమాతో.. ఇది ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది. ఆ సమయంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ఇప్పుడు అచ్చం అలాంటి షిప్ ను నిర్మించబోతున్నారట. పైగా ఈసారి టైటానిక్ 2.. టైటానిక్ 1కంటే కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని వెల్లడించారు. మరి, టైటానిక్ 2 నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఆస్ట్రేలియన్‌ బిలియనీర్ క్లైవ్‌ పాల్మర్‌.. తాను టైటానిక్‌ లాంటిదే మరో షిప్ ను నిర్మిస్తానని ప్రకటించారు. అయితే, టైటానిక్ -2 ను నిర్మించడానికి.. ఒక బిలియన్‌ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.8300 కోట్ల వరకు.. ఖర్చు అయ్యే అవకాశం ఉందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ఈ షిప్ నిర్మాణానికి ఈ ఏడాది జూన్ తర్వాత టెండర్లను పిలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక దీని నిర్మాణ పనులను 2025లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే కనుక .. 2027 జూన్ నాటికి టైటానిక్ 2 షిప్ .. సముద్రం ప్రయాణించడానికి రెడీ అవుతోందని ఆయన వెల్లడించారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. క్లైవ్‌ పాల్మర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ టైటానిక్ -2 ఈసారి అసలైన షిప్ ను మించి ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. దీనితో ఇప్పుడు టైటానిక్ 2 మీద అందరికి ఆశక్తి నెలకొంది.

Titanic return

అయితే, గతంలో కూడా ఈ టైటానిక్ 2 నిర్మాణం గురించి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని విషయాల కారణంగా ఈ షిప్ నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ నిర్మాణ పనులను చేపట్టేందుకు సరైన సమయం వచ్చిందని వెల్లడించారు. ఈ టైటానిక్ 2 షిప్ లో ఈసారి 9 డెక్‌లలో మొత్తం 835 క్యాబిన్‌లు ఉండనున్నాయి. అంతే కాకుండా 2345 మంది ప్రయాణికులు ఈ షిప్ లో ప్రయాణించేందుకు వీలుగా, విశాలంగా ఈ షిప్ నిర్మాణం ఉండబోతుంది. పైగా, దీనిలో సగం గదులను ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయనున్నారు. అలాగే, బాల్‌రూమ్, స్విమ్మింగ్ పూల్, టర్కిష్‌ బాత్‌రూమ్‌లతో.. అచ్చం టైటానిక్‌ షిప్‌లో ఉన్న ఇంటీరియర్స్, క్యాబిన్ లే అవుట్స్ తోనే కలిగి ఉండనుందట. ఇక టైటానిక్‌ ప్రయాణించిన సౌతాంప్టన్- న్యూయార్క్ మార్గంలోనే .. ఈ టైటానిక్ 2 కూడా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు. మరి, టైటానిక్ -2 నిర్మాణ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి