iDreamPost

Mitchell Starc: వీడియో: స్టార్క్ అన్​బిలీవబుల్ బాల్.. ఇలాంటివి వేస్తే రూ.24 కోట్లూ తక్కువే!

  • Published Jan 05, 2024 | 6:14 PMUpdated Jan 05, 2024 | 6:14 PM

ఆస్ట్రేలియా స్పీడ్​స్టర్ మిచెల్ స్టార్క్ మరోసారి సత్తా చాటాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను వణికించే ఈ పేసర్ తాజాగా ఓ నమ్మశక్యం కాని బంతితో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఆస్ట్రేలియా స్పీడ్​స్టర్ మిచెల్ స్టార్క్ మరోసారి సత్తా చాటాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను వణికించే ఈ పేసర్ తాజాగా ఓ నమ్మశక్యం కాని బంతితో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

  • Published Jan 05, 2024 | 6:14 PMUpdated Jan 05, 2024 | 6:14 PM
Mitchell Starc: వీడియో: స్టార్క్ అన్​బిలీవబుల్ బాల్.. ఇలాంటివి వేస్తే రూ.24 కోట్లూ తక్కువే!

ఇప్పుడు క్రికెట్ పూర్తిగా బ్యాట్స్​మెన్ గేమ్​గా మారిపోయింది. టెస్టులను మినహాయిస్తే వన్డేలు, టీ20ల్లో మొత్తం బ్యాటర్లే రాజ్యం అన్నట్లుగా తయారైంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లను తయారు చేస్తుండటంతో లిమిటెడ్ ఓవర్ల క్రికెట్​లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేదు.. అన్ని కంట్రీస్ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఆడియెన్స్​ను స్టేడియాలకు రప్పించడం, వ్యూయర్​షిప్ పెంచడంలో భాగంగా బ్యాటింగ్​కు సహకరించే వికెట్లనే రూపొందిస్తుండటంతో బ్యాట్, బాల్​కు మధ్య సరైన ఫైట్ కనిపించడం లేదు. అయితే ఈ తరుణంలోనూ కొందరు బౌలర్లు సత్తా చాటుతుండటం విశేషం. పిచ్ నుంచి మద్దతు దొరక్కపోయినా తమ బలాన్ని నమ్ముకుంటూ, వేరియేషన్స్ చూపిస్తూ, బ్యాటర్ల వీక్​నెస్​పై దెబ్బ కొట్టి సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకడు మిచెల్ స్టార్క్. క్రికెట్​కు ఆస్ట్రేలియా అందించిన గొప్ప పేసర్లలో ఒకడిగా స్కార్క్​ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఈ స్పీడ్​స్టర్ మరోసారి అన్​బిలీవబుల్ డెలివరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్​లో ఒక నమ్మశక్యం కాని డెలివరీ వేశాడు స్టార్క్. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ టైమ్​లో అబ్దుల్లా షఫీక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పటికే ఐదు బంతులు ఎదుర్కొన్న షఫీక్ ఒక్క రన్ కూడా చేయలేదు. క్రీజులో కుదురుకునేందుకు స్ట్రగుల్ అవుతున్న అతడికి ఓ అన్​బిలీవబుల్ బాల్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు స్టార్క్. ఆసీస్ పేసర్ 143 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆ బాల్ ఆఫ్ వికెట్ మీద పడి ​స్వింగ్ అయి లోపలికి దూసుకొచ్చింది. దీంతో లైన్ మిస్సయిన షఫిక్ బాల్​ను సరిగ్గా డిఫెన్స్ చేయలేకపోయాడు. అది కాస్తా లెగ్ వికెట్​ను గిరాటేసింది. స్టార్క్ వేసిన స్పీడ్​కు వికెట్లు చెల్లాచెదురయ్యాయి. బెయిల్స్ ఎగిరి స్లిప్ ఫీల్డర్ల దగ్గర పడ్డాయి. ఏం జరిగిందో తెలియక షఫీక్ షాక్​లో అలాగే నిల్చున్నాడు. బాల్ అంత స్వింగ్ అవుతుందని అతడు ఊహించలేదు.

ఆ ఓవర్​లో మిగిలిన ఐదు బంతుల్ని డిఫరెంట్​గా వేశాడు స్టార్క్. స్వింగ్ చేయకుండా స్ట్రయిట్ డెలివరీస్ సంధిస్తూ బాగా సెట్ చేశాడు. దీంతో అతడి వలలో పడిన షఫీక్.. తర్వాత వేసిన ఇన్​స్వింగర్​కు కూడా అదే స్టయిల్​లో ఆడి ఔటయ్యాడు. స్టార్క్ వేసిన ఈ అద్భుతమైన బాల్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ అతడ్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అతడ్ని రూ.24 కోట్లు పెట్టి తీసుకోవడంలో తప్పే లేదని అంటున్నారు. స్టార్క్ ఇలాగే బౌలింగ్ చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన క్రికెటర్​గా నిలిచాడు స్టార్క్. అతడ్ని రూ.24.75 కోట్లకు కోల్​కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. పాక్​తో టెస్ట్ సిరీస్​లో స్టార్క్ పెర్ఫార్మెన్స్​ చూసిన కేకేఆర్ ఫ్యాన్స్ అతడికి ఆ ధర వర్త్ అంటున్నారు. మరి.. స్టార్క్ అన్​బిలీవబుల్ డెలీవరీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమిండియాలో కీలక పరిణామం! రోహిత్​కు షాక్.. కెప్టెన్​గా గిల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి