iDreamPost

తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న మహిళా మంత్రి!

  • Published Mar 18, 2024 | 11:19 AMUpdated Mar 18, 2024 | 11:19 AM

ఈ మధ్యకాలంలో స్వలింగ వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ దేశ మహిళ మంత్రి తన స్నేహితురాలిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ మధ్యకాలంలో స్వలింగ వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ దేశ మహిళ మంత్రి తన స్నేహితురాలిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Published Mar 18, 2024 | 11:19 AMUpdated Mar 18, 2024 | 11:19 AM
తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న మహిళా మంత్రి!

ఈ మధ్యకాలంలో స్వలింగ వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇవి మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కువగా జరగుతుండటం అనేది విశేషం. ఈ క్రమంలోనే చాలామంది పురుషులు మరో పురుషునికి వివాహం చేసుకోవడం, అలాగే ఒక మహిళ మరో మహిళకు వివాహం చేసుకువడమనేది చూస్తున్నాం. అయితే ఈ స్వలింగ వివాహాలనేవి చట్టబద్ధం కాదని కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యతిరేకించిన విషయం తెలసిందే. అయిన అందుకు సంబంధించిన వివాహాలనేవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ దేశ విదేశాంగ మంత్రి అయిన మహిళ.. మరో మహిళను వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఆ వివారాళ్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో స్వలింగ వివాహాలనేవి ప్రపంచ దేశాల్లో రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి.. తొలి పార్లమెంటేరియన్ మహిళ పెన్నీ వాంగ్ కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈమె ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొదటిసారిగా తాను స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న విషయం తెలసింది. కాగా, పెన్నీ వాంగ్ తాజాగా తన చిరకాల భాగస్వామి పోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహంకు సంబంధించిన ఫోటోస్ అనేవి అల్లౌచె ఆదివారం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో పెన్నీ వాంగ్ తో పాటు.. పూల బొకె పట్టుకున్న పెళ్లి దుస్తుల్లో అల్లౌచె కనిపిస్తున్నారు. అలాగే వాంగ్ మా కుటుంబ సభ్యులు ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం అని వాంగ్ పేర్కొన్నారు.

The marriage of a female minister with a lady friend

ఇక పెన్నీ వాంగ్ సెనేట్ లో దక్షిణ ఆస్ట్రేలియా తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా కేబినెట్ లో స్థానం సంపాదించుకున్న ఆసియా (చైనా)లో జన్మించిన మొదటి వ్యక్తి. అయితే.. ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. కనుక శనివారం ఆడిలైడ్ లోన ఓ ద్రాక్ష తోటలో పెన్నీ, అల్లౌచె వివాహ వేడుక జరిగినట్లు సీడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. కాగా, పెన్నీ, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దలుగా కలిసి ఉంటుడగా.. ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటైయ్యారు.మరి, ఆస్ట్రేలియా మహిళ మంత్రి పెన్నీ వాంగ్ తన స్నేహితురాలను స్వలింగ వివాహం చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి