iDreamPost

VIDEO: ఈ వరల్డ్ కప్​లో బెస్ట్ క్యాచ్ ఇదేనేమో.. డస్సెన్​ను మెచ్చుకోవాల్సిందే!

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో డస్సెన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. గాల్లోకి డైవ్ కొట్టి బంతిని అందుకున్న తీరు వరల్డ్ కప్ కే బెస్ట్ క్యాచ్ గా ఉందంటూ క్రికెట్ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో డస్సెన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. గాల్లోకి డైవ్ కొట్టి బంతిని అందుకున్న తీరు వరల్డ్ కప్ కే బెస్ట్ క్యాచ్ గా ఉందంటూ క్రికెట్ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.

VIDEO: ఈ వరల్డ్ కప్​లో బెస్ట్ క్యాచ్ ఇదేనేమో.. డస్సెన్​ను మెచ్చుకోవాల్సిందే!

వన్డే వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ జరుగుతున్నాయి. నిన్న భారత్, న్యూజీలాండ్ మధ్య హోరాహోరీ పోరు జరుగగా అంతిమంగా ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో అపజయమే లేకుండా రోహిత్ సేన ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. కాగా నేడు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోంది. ఫైనల్ బెర్తు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. సఫారీ క్రికెటర్ డస్సెన్ ఆశ్చర్యకర రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇప్పటి వరకు అద్భుతమైన క్యాచ్ లను చూశాము, కానీ ఇది అంతకు మించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్.

క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని క్రికెట్ లో బాగా వినిపిస్తుంది. వాస్తవానికి ఇది నిజమే. ఎందుకంటే చేతికి అందవచ్చిన క్యాచ్ లను జారవిడిస్తే ఆఖరికి మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంటుంది. గెలుపోటములపై క్యాచ్ లు అంతటి ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణంగా గ్రౌండ్ లో ఫీల్డర్స్ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ లు పట్టడం, గాల్లోకి డైవ్ కొట్టి, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి క్యాచ్ లు ఒడిసి పడతారు ఆటగాళ్లు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో అటువంటి అద్భుతమైన క్యాచ్ లు చాలానే నమోదయ్యాయి. ఈ రోజు జరుగుతున్న సెమీ ఫైనల్లో మరో కల్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు సౌతాఫ్రికా ప్లేయర్ డస్సెన్. దీంతో ఆసిస్ ఆటగాడు మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు.

రబాడ వేసిన 7వ ఓవర్ నాలుగో బంతిని మిచెల్ మార్ష్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి గాల్లోకి లేవగానే రెప్పపాటులో గాల్లోకి డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్నాడు డస్సెన్. దీంతో ఈ క్యాచ్ వరల్డ్ కప్ లోనే బెస్ట్ క్యాచ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా పేలవమైన ప్రదర్శన చేసింది. 49.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 41 ఓవర్లు ముగిసే సరికి 195 పరుగులతో విజయం దిశగా ఆటను కొనసాగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి