iDreamPost

తమిళనాడులో AP అయ్యప్ప భక్తులపై దాడి..!

కేరళలో ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచిన శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో..

కేరళలో ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచిన శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో..

తమిళనాడులో AP అయ్యప్ప భక్తులపై దాడి..!

గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో కొలువై ఉన్నాడు అయ్యప్ప స్వామి. శబరిమలలో నెలవైన ఈ దేవుడ్ని ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయ్యప్ప మాలలు ధరించి.. ఆ మణికంఠుడ్ని సందర్శించి.. ఆ తర్వాత మాల విరమణ చేస్తారు. అయితే ఈ గుడికి వెళ్లడానికి ముందు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో తిరుచ్చి శ్రీరంగ నాథ స్వామి ఆలయాన్ని వీక్షించేందుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు. అయితే అక్కడ ఏపీ భక్తులపై ఆలయ నిర్వాహకులు దాడి చేశారు. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఆ గుడిలో ఏం జరిగిందంటే..

ఏపీ నుండి కొంత మంది అయ్యప్ప భక్తులు.. మాల ధరించి.. శబరిమలలోని అయ్యప్పను దర్శించేందుకు వెళ్లారు. మార్గమధ్యంలో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లగా.. ఆలయ నిర్వాహకులు వీఐపీల పేరుతో కొందరినీ ప్రత్యేక దర్శనానికి అనుమతించారు. వారిని ఎందుకు అలా లోపలికి పంపిస్తున్నారంటూ భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నించారు. భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో.. వివాదం మొదలైంది. ఈ విషయంపై ఆలయ సెక్యూరిటీ జోక్యం చేసుకునే క్రమంలో.. భక్తులపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

చేతికి దొరికిన వస్తువులతో కొట్టడంతో ఇద్దరు అయ్యప్ప భక్తులుగాయపడ్డారు. ఒక యాత్రికుడు రక్తపుగాయాలతో నేలపై పడిపోయాడు. ఇలా దాడి చేయడం అమానుషమంటూ నిరసన వ్యక్తం చేశారు మిగిలిన భక్తులు. ఈ వివాదం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు నమోదు చేసుకుని, విచారణ చేపడుతున్నారు. తప్పు ఎవరిదీ అన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే తమను క్యూలైన్లలో ఉంచి.. మరొకరిని దర్శనానికి పంపిస్తున్నారంటూ చెప్పారు.  ఇలా మాల ధారణలో ఉన్న స్వాముల పట్ల గుడి ఆలయ నిర్వాహకులు దాడి చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి