iDreamPost

మొబైల్‌ నెట్‌వర్క్‌లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కి డాలర్స్‌లో పరిహారం!

  • Published Feb 26, 2024 | 3:58 PMUpdated Feb 26, 2024 | 4:43 PM

చాలా సార్లు మనం వాడే మొబైల్ లో నెట్ వర్క్ కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం. అయితే తాజాగా ఓ దేశంలో మాత్రం ఏకంగా అన్ని గంటలు నెట్ వర్క్ సమస్యలు తలెత్తడంతో ఆయా నెట్ వర్క్ సంస్థలు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చాలా సార్లు మనం వాడే మొబైల్ లో నెట్ వర్క్ కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం. అయితే తాజాగా ఓ దేశంలో మాత్రం ఏకంగా అన్ని గంటలు నెట్ వర్క్ సమస్యలు తలెత్తడంతో ఆయా నెట్ వర్క్ సంస్థలు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 26, 2024 | 3:58 PMUpdated Feb 26, 2024 | 4:43 PM
మొబైల్‌ నెట్‌వర్క్‌లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కి డాలర్స్‌లో పరిహారం!

ప్రస్తుత కాలంలో టెలికాం సంస్థలను వినియోగించని వారంటూ ఎవరు ఉండారు. ఎందుకంటే.. ప్రతిఒక్కరి దగ్గర రకరకాల సెల్ ఫోన్స్ అనేవి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే చిన్న నుంచి పెద్ద వరకు చాలామందికి ఈ ఫోన్ లేకపోతే చాలు ఒక్క క్షణం కూడా గడవదు. మరి, సెల్ ఫోన్ ని ప్రపంచంగా భావించే ఈ కాలంలో నిమిషం ఫోన్ పని చేయకపోయినా, సిగ్నెల్ రాకపోయినా, నెట్ వర్క్ అగిపోయినా.. గందరగోళంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ దేశంలో మాత్రం ఏకంగా అన్ని గంటలు నెట్ వర్క్ కు అంతరాయం కలిగింది. దీంతో అక్కడ వినియోగదారులకు ఎదురైన సమస్యకు ఏటీ అండ్ టీ అనే సంస్థ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఏం జరిగిందంటే..

చాలా సార్లు మనం వాడే మొబైల్ లో నెట్ వర్క్ కనెక్టివిటీకి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఇలా మొబైల్ నెట్ వర్క్ ల్లో అంతరాయాలు రావడం సహజం. కానీ, తాజాగా అమెరికాలోని మాత్రం ఏకంగా 10 గంటల పాటు అక్కడ ఈ మొబైల్ నెట్ వర్క్ సంబంధించి అంతరాయం కలిగింది. కాగా, అక్కడ ఏటీ అండ్‌టీ అనే సంస్థ 5జీ నెట్వర్క్‌ని అందిస్తుంది. వీరికి ఇక్కడ 290 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. పైగా, గతవారం కూడా అమెరికాలోని పలు ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.దీంతో అమెరికాలోని ఏటీ అండ్ టీ అనే సంస్థ తమ నెట్ వర్క్ లో ఎదురైన సమస్యకు గాను వినియొగదారులకు 5 డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని ఆదివారం ప్రకటించింది. కాగా, వచ్చే రెండు బిల్లింగ్ సైకిళ్లలో ఈ మొత్తాన్ని ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. అయితే ప్రీ పెయిడ్ యూజర్లు కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కానీ అవి ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు.

అయితే, ఏటీ అండ్ టీ, వెరిజోన్, టి మొబైల్ తో పాటు ఇతర మొబైల్ నెట్ వర్క్ ల్లోఈ కనెక్టివిటీ సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. పైగా ఇది షికాగో, లాస్‌ ఏంజలస్‌, న్యూయయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్‌, బ్రూక్లిన్‌ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ నెట్వర్క్‌ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. మరి, అమెరికాలో నెట్ వర్క్ సమస్యలు తలెత్తడంతో వినియోగదారులకు ఐదు డాలర్లు అందిస్తామని ముందుకు వచ్చే ఏటీ అండ్‌టీ సంస్థ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి