iDreamPost

Asia Cup 2002 మ‌రో టి20 క్లాసిక్, ఇండియా ఫైర్, న‌వాజ్ మాస్ట‌ర్ క్లాస్, మిస్సింగ్ క్యాచ్, సెన్షేష‌న‌ల్ ఫైన‌ల్ ఓవ‌ర్

Asia Cup 2002 మ‌రో టి20 క్లాసిక్, ఇండియా ఫైర్, న‌వాజ్ మాస్ట‌ర్ క్లాస్, మిస్సింగ్ క్యాచ్, సెన్షేష‌న‌ల్ ఫైన‌ల్ ఓవ‌ర్

మ‌రో వారం, మ‌రో ఇండియా-పాకిస్థాన్ టీ20 థ్రిల్ల‌ర్. ఈసారి ఛేజింగ్ చేసిన పాకిస్తాన్ చివ‌ర్ల‌లో గెల్చింది.

పాక్ తో మ్యాచ్ లో మొద‌టి నాలుగు ఓవ‌ర్ల‌లోనే నాలుగు సిక్స్ లు కొట్టిన ఇండియా 4.2 ఓవ‌ర్ల‌లోనే 50ప‌రుగులు చేసింది. అప్పుడు ఇండియా ఈజీగా 194 ప‌రుగులు చేస్తుంద‌న్న‌ది క్రిక్ ఇన్ఫో ప్రిడెక్ట్ చేసింది. చివ‌ర‌కు 181 ర‌న్స్ ద‌గ్గ‌ర ఆగిపోయింది. అది కూడా ఆఖ‌రి రెండు బాల్స్ లో, మిస్ ఫీల్డ్ వ‌ల్ల రెండు ఫోర్లు వ‌చ్చాయి. తెలుగు సినిమాలా రోహిత్ హిట్టింగ్ తో మొద‌లైన ఇన్సింగ్స్, క్లైమాక్స్ కి వెళ్లేస‌రికి దారి త‌ప్పింది. మొద‌ట్లో విజృంభించిన విరాట్ కోహ్లీ చివ‌ర్ల‌లో కాస్త స్లో అయ్యాడు. తాను ఔట్ అయితే హిట్టింగ్ చేసేవాళ్లు లేర‌ని, చివ‌రి బంతి వ‌ర‌కు నిల‌బ‌డాల‌నుకున్నాడు. ఆ వ్యూహం ప‌నిచేయ‌లేదు. చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఇండియా 88ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

ఏ పిచ్ మీదైనా, ఏ కండీష‌న్స్ లోనైనా 180 నిజంగా మంచి స్కోరు. కాని మిడిల్ ఓవ‌ర్ల‌లో వికెట్ల‌ను తీయ‌లేన‌ప్పుడు మ్యాచ్ నెమ్మ‌దిగా చేతిలోంచి జారిపోతుంది. ఈ పాఠాన్ని ఇండియా నేర్చుకుంది.

నిజానికి ఇన్నింగ్స్ మొత్తాన్ని పాక్ కంట్రోల్ చేసింది. బాబ‌ర్ అజం మ‌రోసారి ఫెయిల్ అయినా, రిజ్వాన్ 51 బాల్స్ లో 71 ర‌న్స్ కొట్టి వెన్నుముక‌లా నిలిచాడు. ఈ మ్యాచ్ లో స్టార్ న‌వాజ్. అవ‌స‌ర‌మైనప్పుడు 20 బాల్స్ లో 42 ర‌న్స్ కొట్టి ఇండియాకు ద‌డ‌పుట్టించాడు. రిజ్వాన్, న‌వాజ్ భాగ‌స్వామ్యం ఈ మ్యాచ్ కే హైలెట్. భార‌త్ బౌల‌ర్లు మాత్రం చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 26 కొట్టాల్సిన‌ రేంజ్ కి మ్యాచ్ ని తీసుకొచ్చారు. ఎప్పుడూ 19 ఓవ‌ర్ లోనే మ్యాచ్ ను గెల్పించే భువ‌నేశ్వ‌ర్ 19 ర‌న్స్ ఇచ్చాడు. టీ20ల్లో అత‌ను ఇన్ని ర‌న్స్ ఇవ్వ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే. ఆసిఫ్ ఆలీ, కుష్దిల్ షాలు భువి వైడ‌ర్ డెలివ‌రీల‌తో 19 ర‌న్స్ కొట్ట‌డంతో చివ‌రి ఓవ‌ర్ కి 7 ర‌న్స్ సాధిస్తే స‌రిపోతుంది. అక్క‌డితోనే మ్యాచ్ అయిపోయిందనుకున్నా, అర్ష్ దీప్ డ్రామా చేశాడు. అంత‌కుముందు కీల‌క‌మైన క్యాచ్ ను వ‌దిలిపెట్టిన ఈ బౌల‌ర్, చివ‌రి రెండు బాల్స్ వ‌ర‌కు మ్యాచ్ ను తీసుకెళ్లాడు. ఇఫ్తికార్ రెండు ర‌న్స్ కొట్టి పాక్ ను గెల్పించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి