iDreamPost

సంపాదనలో దూసుకెళ్తున్న AI మోడల్.. ఏకంగా అన్ని లక్షలా?

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇటీవల ఏఐ న్యూస్ యాంకర్స్ హల్ చల్ చేయగా తాజాగా ఏఐ మోడల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లక్షల్లో డబ్బు సంపాదిస్తుంది.

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇటీవల ఏఐ న్యూస్ యాంకర్స్ హల్ చల్ చేయగా తాజాగా ఏఐ మోడల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లక్షల్లో డబ్బు సంపాదిస్తుంది.

సంపాదనలో దూసుకెళ్తున్న AI మోడల్.. ఏకంగా అన్ని లక్షలా?

ఇక్కడ మీరు చూస్తున్న ఆ అందగత్తే ఓ మోడల్. ఇప్పటి వరకు ఇలా ఏ మోడల్ సంపాదించని సంపాదనను ఈమె ఆర్జిస్తోంది. ఏకంగా నెలకు రూ. 3 లక్షలు ఒక్కోసారి సుమారు రూ. 10 లక్షల వరకు సంపాదిస్తూ దూసుకెళ్తోంది. దీంతో ఈమె వ్యవహారం నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఈ ముద్దుగుమ్మ ఓ ఏఐ మోడల్. స్పానిష్​ డిజైనర్​ రుబెన్​ క్రూజ్​, ఆయన కంపెనీ ‘ది క్లూలెస్’​ కలిసి ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో సృష్టించిందే ఈ మోడల్​. ఏఐ మోడల్ పేరు ఐటానా అని గా నామకరనం చేశారు. ఈ మోడల్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఎన్నో అద్భుతాలకు వేదిక అవుతోంది. ఈ క్రమంలోనే రోబోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్స్, ఇప్పుడు తాజాగా మోడల్ పుట్టుకొస్తున్నారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వారు ఏఐ న్యూస్ రీడర్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో ఏఐ మోడల్ హల్ చల్ చేస్తోంది. రుబెన్ క్రూజ్ అనే డిజైనర్ ఏఐ మోడల్ ఆవిష్కరనకు తెరలేపారు. దీనికి గల కారణం వారి బిజెనెస్ ను డెవలప్ చేసుకోవడంలో భాగమే అని తెలుస్తోంది. కొన్ని సార్లు వ్యాపార వ్యవహారాల్లో కొన్ని అంశాల్లో తీవ్రంగా నష్టం కలుగుతోందని, ఇన్ ఫ్యుయేంజర్స్, మోడల్స్ తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రుబెన్ తెలిపారు.

అదేవిధంగా మోడల్స్​, ఇన్​ఫ్లుయెంజర్స్​పై చేస్తున్న ఖర్చు చాలా పెరిగిపోయింది అని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము చేసిన ఆలోచన ఏఐ మోడల్. మాకు మేము ఒక మోడల్​ని సృష్టించుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి చివరికి అందమైన ఏఐ మోడల్ ను రూపొందించామని తెలిపారు. సెలబ్రిటీలకు తీసిపోని రూపంతో ఉన్న ఈ ఏఐ మోడల్ ఆన్ లైన్ యాడ్స్ చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తుంది. ఇదే కాక పలు కంపెనీలకు మోడల్​గా కూడా వ్యవహరిస్తోందట. ఈ ఏఐ మోడల్​ ఐటానా.. సగటున నెలకు 3వేల పౌండ్ల(మూడు లక్షలు) నుంచి 10వేల పౌండ్ల(తొమ్మిది లక్షలు) వరకు సంపాదిస్తోందట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి