iDreamPost

కొత్త లుక్​లో తెగ సిగ్గుపడుతున్న అరియానా.. వీడియో వైరల్!

  • Author singhj Published - 09:06 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 09:06 PM, Fri - 11 August 23
కొత్త లుక్​లో తెగ సిగ్గుపడుతున్న అరియానా.. వీడియో వైరల్!

అరియానా గ్లోరీ.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో ఆమె సెన్సేషన్​గా మారారు. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్స్​కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నెట్టంట ఆమె షేర్ చేస్తుంటారు. గ్లామర్​ షోతో యువతను కట్టిపడేసే అరియానాకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య కాస్త బరువు పెరిగారీ సుందరి. అయితే చక్కనమ్మ బొద్దుగా ఉన్నా అందమే అన్నట్లు తన కొత్త లుక్స్​తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు అరియానా.

సోషల్ మీడియాలో పాపులరైన అరియానా.. బిగ్ బాస్​ షో ద్వారా తన క్రేజ్​ను మరింత పెంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్​తోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ మరింత ఎక్కువైంది. తొలుత హైదరాబాద్​లో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ వచ్చిన అరియానా.. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్​గా మారారు. యాంకరింగ్​లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో అనుకోకుండా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ అరియానాకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మకు తగిన విధంగా బోల్డ్​గా మాట్లాడి ఆడియెన్స్​ను ఆకర్షించారామె.

ఆ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. దీంతో అసలు ఎవరీ అరియానా గ్లోరీ అంటూ నెటిజన్స్ వెతకడం మొదలుపెట్టారు. అలా పాపులర్ అయిన ఈ క్యూటీ.. ఆ తర్వాత బిగ్​ బాస్ షోతో అందరికీ సుపరిచితురాలు అయిపోయారు. అలాంటి అరియానా తాజాగా ఒక వీడియోను నెట్టింట పంచుకున్నారు. ఇందులో పూర్తిగా కొత్త లుక్​లో కనిపిస్తున్నారీ బ్యూటీ. కారులో జర్నీ చేస్తున్న అరియానా.. ఆ వీడియోలో బొద్దుగా, ముద్దుగా కనిపించారు. న్యూ లుక్​లో తెగ సిగ్గుపడిపోతున్న అరియానా వీడియో వైరల్ అవుతోంది. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలని ఈ వీడియోకు ఆమె క్యాప్షన్ జతచేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి