iDreamPost

Creditcards: క్రెడిట్ కార్డులు అతిగా వాడేస్తున్నారా?అయితే పేదరికంలోకే!

మీరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారా? మీకు తెలియకుండానే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్రెడిట్ కార్డులు మరింత పేదరికంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

మీరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారా? మీకు తెలియకుండానే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్రెడిట్ కార్డులు మరింత పేదరికంలోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

Creditcards: క్రెడిట్ కార్డులు అతిగా వాడేస్తున్నారా?అయితే పేదరికంలోకే!

క్రెడిట్ కార్డ్స్ వినియోగం ఇటీవల గణనీయంగా పెరిగిపోయింది. ధనవంతుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు వివిధ రకాల క్రెడిట్ కార్డులను తీసుకుని వినియోగిస్తున్నారు. బ్యాంకులు కూడా రకరకాల ఆఫర్లతో తక్కువ జీతాలు ఉన్నవారికి కూడా క్రెడిట్ కార్డులను అంటగడుతున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ కోసం, నగదు అవసరమైనప్పుడు కార్డు స్వైప్ చేసి తీసుకోవడం క్రెడిట్ కార్డులను విరివిగా వాడేస్తున్నారు. ఒక్కొసారి పరిమితికి మించి వాడడం, సకాలంలో ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికభారం ఎక్కువైపోతుంటుంది. అయితే క్రెడిట్ కార్డులను మితిమీరి వాడడంతో మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నామా? ఆర్థికంగా చితికి పోతున్నామా అనే సందేహాలు కలగకమానడం లేదు.

క్రెడిట్ కార్డులతో లాభం ఎంతుందో.. దాన్ని సరైన పద్దతిలో వాడకుంటే నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఎలాగు చేతిలో క్రెడిట్ కార్డు ఉందికదా అని ఇబ్బడిముబ్బడిగా వాడేస్తుంటారు కొందరు. ఆ తర్వాత ఆ బిల్లులను చెల్లించలేక నానా తంటాలు పడుతుంటారు. సకాలంలో క్రెడిట్ బిల్లులు చెల్లించకుంటే బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను వసూల్ చేస్తుంటాయి. పైగా పెనాల్టీలు కూడా విధిస్తుంటాయి. క్రెడిట్ కార్డు అప్పటికప్పుడు ఆర్థిక అవసరాలను తీరుస్తుందన్నది ఎంత నిజమో.. ఆర్థిక భారానికి కారణమవుతుందన్నది కూడా అంతే నిజం. క్రెడిట్ కార్డులో మినిమం బ్యాలెన్స్ ఆప్షన్ తో మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే బిల్స్ ను ఒకేసారి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. ఆ ఆప్షన్ తో కొన్ని సంవత్సరాలపాటు బిల్స్ చెల్లిస్తూ ఉంటే మీ సంపాదన ఇక్కడే కరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్స్ పై 36 శాతం నుంచి 48 శాతం వరకూ వడ్డీని వసూల్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్బాల్లో మినిమమ్ అమౌంట్ పే చేసుకుంటూ పోతే వడ్డీల భారం ఎక్కువవుతుంటుంది. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్ నిర్ధేశిత గడువులోగా పూర్తి కాకపోతే లేట్ ఫీజు, వడ్డీల భారం పడుతుంది. అంతేకాదు క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిణామం మీరు భవిష్యత్తులో ఏదైనా అవసరానికి లేదా బిజినెస్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు లోన్ మంజూరుకాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ కూడా ఆర్థికంగా చితికి పోవడానకి కారణమవుతున్నాయి. ఎందుకంటే ఏదైనా వస్తువును కొనాలనుకున్నప్పుడు ఒక్కొ వస్తువుపై ఒక్కో రకమైన క్రెడిట్ కార్డులపై ఆఫర్స్ ఇస్తుంటాయి.

అలాంటి సందర్బాల్లో ఆ ఆఫర్లను వినియోగించుకునేందుకు అన్ని బ్యాంకుల కార్డులు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. అయితే అన్ని క్రెడిట్ కార్డులను వినియోగించుకోవడం కుదరకపోవచ్చు. అయినప్పటికీ వార్షిక ఛార్జీలు, రెన్యూవల్ ఛార్జీల భారం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా డబ్బు వృథాగా ఖర్చైపోతుంటుంది. ఈ కారణాలతో క్రెడిట్ కార్డుల వాడకం ఆర్థిక భారానికి దారితీస్తుందని బిజినెస్ నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి మీకు కూడా క్రెడిట్ కార్డును విపరీతంగా వాడే అలవాటు ఉంటే ఆచీతూచీ వాడుకోవడం బెటర్. మరి క్రెడిట్ కార్డుల వాడకంతో పేదవాళ్లుగా మారుతున్నామా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి