iDreamPost

AP ఫైబర్ నెట్ కేసులో ట్విస్ట్.. తెరపైకి మరో మాజీ మంత్రి పేరు!

AP ఫైబర్ నెట్ కేసులో ట్విస్ట్.. తెరపైకి మరో మాజీ మంత్రి పేరు!

ప్రస్తుతం ఏపీ రాజకీయంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో మరింత ఆసక్తికరంగా మారాయి ఏపీ రాజకీయాలు. ఇక చంద్రబాబు చుట్టూ మరికొన్ని కేసులు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులు ఉన్నాయి. ఇక ప్రధానంగా ఫైబర్ నెట్ భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు.  చాలా రోజుల నుంచి ఈ కుంభకోణంలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారా లోకేశ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హస్తమున్నట్లు మరో టీడీపీ నేత, మాజీ మంత్రి పేరు వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్‌ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడి పేరు కూడా బయటకు వస్తుందంటూ ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ పాత్ర ఉందా లేదా అనేది సీఐడీ చెబుతుందని ఆయన అన్నారు. అంతేకాక అసలు నిజాలు సీఐడీ దర్యాప్తులో తేలుతుందని అన్నారు. యనమల రామకృష్ణుడు పాత్ర గురించి అప్పట్లోనే తాను చెప్పానని గౌతమ్ రెడ్డి అన్నారు. ఇక ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు హస్తం ఉందని గతంలోనే చెప్పానన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, కాలం మారడంతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారని గౌతమ్ రెడ్డి తెలిపారు.

చంద్రబాబు ఎందరిని మానసిక క్షోభకు గురి చేశాడని, చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని ఆయన పేర్కొన్నారు. తనను కూడా జైలుకు పంపించారన్నారు గౌతమ్ రెడ్డి అన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్‌ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబుపైనా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని గతంలోనే టాక్ వినిపించింది. తాజాగా మాజీ మంత్రి యనమల పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి.. ఈ కుంభ కోణంలో మరెన్ని ట్విస్టులు ఉంటాయో  తెలియదు. మరి.. ఈ ఫైబర్ నెట్ కేసులో మాజీ మంత్రి యనమల రామకృష్ణ పేరు తెరపైకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి