iDreamPost

మరో గుడ్ న్యూస్.. APలోని ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ఉద్యోగార్థలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా రూ. లక్షన్నర వరకు జీతాన్ని అందుకోవచ్చు. అర్హులు ఎవరంటే?

ఉద్యోగార్థలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా రూ. లక్షన్నర వరకు జీతాన్ని అందుకోవచ్చు. అర్హులు ఎవరంటే?

మరో గుడ్ న్యూస్.. APలోని ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఏపీ సర్కార్ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు తీపి కబురును అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయగా వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవే కాకుండా వివిధ శాఖల్లో కూడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఈవో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 9 నుంచి 29 2024 వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన ఆశావాహులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులు

మొత్తం పోస్టులు:

  • 38

విద్యార్హత:

  • ఈ డీఈవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలిచిన వారు పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరి వర్గాల వారికి వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.61,960 – రూ.1,51,370.

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం:

  • 09-01-2024.

అప్లికేషన్ కు చివరితేది:

  • 29-01-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి