iDreamPost
android-app
ios-app

బ్యాంక్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 4 లక్షల జీతం.. అర్హతలు ఏంటంటే?

ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 4 లక్షలు వేతనంగా అందిస్తారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ఎప్పటినుంచో బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకిది మంచి సువర్ణావకాశం. డిగ్రీ అర్హతతోనే బ్యాంక్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 60 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 11గా నిర్ణయించారు. అప్లై చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సీబీహెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్ సైట్ https://www.cbhfl.com/ ను సందర్శించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 60

పోస్టుల వారిగా వివరాలు:

ఆఫీసర్‌:

  • 31 పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం ఏడాది ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

సీనియర్‌ ఆఫీసర్‌:

  • 27 పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌):

  • 01 పోస్టు

అర్హత:

  • అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ(హెచ్‌ఆర్‌) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

సీనియర్‌ ఆఫీసర్‌ (కంప్లైన్స్‌):

  • 01 పోస్టు

అర్హత:

  • అభ్యర్థులకు డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

అప్లికేషన్ విధానం:

  • ఆన్‌లైన్‌

అప్లికేషన్ ఫీజు:

  • రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.3.60 లక్షలు, సీనియర్ ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.4 లక్షలు చెల్లిస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ:

  • 11-12-2023

ఫీజు చెల్లింపుకు చివరితేది:

  • 11-12-2023

ఆన్‌లైన్ పరీక్ష తేది:

  • జనవరి, 2024.

సీబీహెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి