iDreamPost

ప్రధానితో చ‌ర్చ‌కు ఏపీ సర్పంచ్ కు పిలుపు

ప్రధానితో చ‌ర్చ‌కు ఏపీ సర్పంచ్ కు పిలుపు

బాల్య వివాహాల చట్టంలో క‌నీస వయస్సును సవరించాలని కేంద్రం నిర్ణ‌యించింది. ఇందుకు ఓ బిల్లును ప్రవేశపెట్ట‌నుంది. అయితే, దానికంటే ముందు దీనిపై చర్చించాలని ప్రధాని నరేంద్ర మోడీ అనుకున్నారు. మ‌రి ఎవ‌రితో మాట్లాడాలి? ఎవ‌రి నుంచి అభిప్రాయాల‌ను ప్ర‌ధాని స్వ‌యంగా స్వీక‌రించాలి? అందుకే ప‌లు రాష్ట్రాల నుంచి కొంద‌రి ఎంపిక చేస్తున్నారు. వీరిలో ఏపీ రాష్ట్రానికి చెందిన 8 మంది ఉన్నారు. కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్, డాక్టర్ దొళాయి జగబంధు కూడా ప్ర‌ధానితో మాట్లాడ‌నున్నారు. జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఐదుగురు సర్పంచ్ లతో మోడీ ఆన్ లైన్ లో చర్చించనున్నారు. ఎంపిక చేసిన 8 మందికి సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, తలతంపర సర్పంచ్‌ డాక్టర్‌ జగబంధు తెలిపారు. ఈనెల 31వ తేదీన అమరావతిలో సమావేశం ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి కమిటీలను నియమించి.. అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు.
1929లో బాల్య వివాహాల కట్టడం చట్టం వచ్చింది. కనీస వివాహ వయస్సు బాలికలకు 14, బాలురకు 18 ఏళ్లు ఉండాలని పేర్కొంది. 1949లో సవరణ చేసి బాలికల కనీస వివాహ వయస్సు 15 ఏళ్లకు పెంచారు. 1978లో ఇదే చట్టాన్ని సవరించి.. యువతుల కనీస పెళ్లి వయస్సును 18 ఏళ్లుగా యువకుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లుగా నిర్దేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి