iDreamPost

వామ్మో జగన్‌.. ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఇచ్చాడా..?

వామ్మో జగన్‌.. ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఇచ్చాడా..?

ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు.. అనే మూల సూత్రంపై ప్రజా స్వామ్యం ఆధారపడి ఉంది. అలాగే ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. వారి అభివృద్ధి, అభ్యున్నతి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనం ప్రతి రూపాయి సక్రమమైన మార్గంలో ఖర్చు పెడుతూ, ప్రజలకే ధనాన్ని అందిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతతో వైసీపీ సర్కార్‌ పని చేస్తున్నట్లు ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఏడాది మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే జూన్‌ ఒకటో తేదీ నుంచి పరిపాలన మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ ఏడాది కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు నేరుగా 40, 139 కోట్ల రూపాయలు అందించింది. వివిధ సంక్షేమ పథకాల కింద ఆయా మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. లంచాలు, అవినీతి, కమిషన్లు ఏమీ లేకుండా ప్రజల ధనం.. ప్రజలకే చేర్చి సరికొత్త చరిత్రను సృష్టించింది.

కులం, మతం, పార్టీలు అనే వ్యత్యాసం, వివక్ష అనేది లేకుండా.. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అందించిందని ఆయా వర్గాల ప్రజలు పొందిన లబ్ధిని బట్టి తెలుస్తోంది. 40,139 కోట్లలో ఏ ఏ కులాల వారు ఎంత మందికి, ఎంత మేర చేరిందో సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా వెల్లడించారు.

జూన్‌ నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ 3,57,51,612 మందికి 40,139 కోట్ట రూపాయలు అందాయి. 1,78,42,048 మంది బీసీలకు 19,298 కోట్ల రూపాయలు అందాయి. 61,26,203 మంది ఎస్సీ సామాజికవర్గ ప్రజలకు 6,332 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. 18,39,451 మంది ఎస్టీలకు 2,108 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో చేరాయి. 18,61,862 మంది మైనారిటీలకు 1,701 కోట్లు లభించాయి. ఓసీ సామాజికవర్గాలని చెందిన 77,47,889 మంది 10,462 వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఈ మొత్తం అంతా.. వివిధ పథకాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందించింది.

నిన్న మొన్నటి వరకు పలు ప్రభుత్వాలు.. బీసీ సబ్‌ప్లాన్, ఎస్సీ సబ్‌ ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంటూ.. బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం, ఆనక ఆ నిధులను వేరే ఖర్చులకు మళ్లించడం ఇప్పటి వరకూ చూశాం. కానీ వైసీపీ ప్రభుత్వం కేటాయింపులు చేయడమే కాదు.. అంతకు మించి ఆయా సామాజికవర్గాలకు మేలు చేసిందని పై గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి