iDreamPost

వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే చెక్కుల పంపిణీ!

వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపే చెక్కుల పంపిణీ!

వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత వ్రత పురోహితులకు తీపి కబురును అందించింది. గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. దీంతో విశ్రాంత వ్రత పురోహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 33 మందికి లబ్ధి చేకూరనుంది. విశ్రాంత వ్రత పురోహితులు భారీగా గ్రాట్యుటీని పొందనున్నారు. గ్రాట్యుటీకి సంబంధించిన చెక్కులను రేపు అనగా మంగళవారం నాడు పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అన్నవరం ఆలయంలోని రిటైర్డ్ వ్రత పురోహితులకు గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమకు గ్రాట్యుటీ చెల్లించాలని వ్రత పురోహితులు చేసిన విన్నపం పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విశ్రాంత వ్రత పురోహితుల సర్వీసును అనుసరించి సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున గ్రాట్యుటీ చెల్లించాలని సంబంధింత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో విశ్రాంత వ్రత పురోహితులు గరిష్టంగా రూ.4.5 లక్షలు, కనిష్టంగా రూ.1.5 లక్షల వరకూ గ్రాట్యుటీ అందుకోనున్నారు.

అన్నవరం ఆలయంలో సేవలందిస్తున్న వ్రత పురోహితులు 65 ఏండ్ల తర్వాత పదవీ విరమణ పొందుతారు. అయితే ఇది వరకు పురోహితులు ఎన్ని సంవత్సరాలు సేవలందించినా వారు రిటైర్డ్ అయిన తర్వాత రూ. 1లక్ష మత్రమే చెల్లించేవారు. ఈ క్రమంలో వ్రత పురోహితులు ముత్య సత్యనారాయణ, ప్రయాగ వేంకట రమణ గత ఏప్రిల్‌ నెలాఖరున పదవీ విరమణ చేశారు. తాము దాదాపు 40 ఏళ్ల సర్వీసు పూర్తి చేశామని.. తమ సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వానికి వారు దరఖాస్తు చేసుకున్నారు.

కాగా ఆ ఇద్దరి సర్వీసు ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వారికి రూ. 4.70 లక్షల చొప్పున గ్రాట్యుటీ చెల్లించారు. ఈ నేపథ్యంలో 2015 నుంచి 2023 వరకు రిటైర్డ్ అయిన వ్రత పురోహితులందరికి ఈ ఉత్తర్వులను అమలు చేయాలని విశ్రాంత పురోహితులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వారికి కూడా గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విశ్రాంత వ్రత పురోహితులకు గ్రాట్యుటీ చెక్కులను అందించనున్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి