iDreamPost

వారికి జగన్ సర్కారు శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్​లో రూ.లక్షన్నర వరకు జమ!

  • Author singhj Published - 09:01 AM, Thu - 23 November 23

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు జమ చేయనుంది.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు జమ చేయనుంది.

  • Author singhj Published - 09:01 AM, Thu - 23 November 23
వారికి జగన్ సర్కారు శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్​లో రూ.లక్షన్నర వరకు జమ!

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఆ రంగం, ఈ రంగం అనే తేడాల్లేకుండా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. డెవలప్​మెంట్​ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్​కు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో గణనీయ మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్. అందుకే పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్​ దూసుకెళ్తోంది. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ఆయన నమ్మడం వల్లే ఎవరూ ఊహించని విధంగా అనేక విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.

చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం జగన్​ గురువారం విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల అకౌంట్స్​లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో పాటు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.

మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు సీఎం జగన్. పేదల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే ఆలోచనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు కొన్ని అర్హతలు నిర్ణయించారు. పెళ్లి చేసుకున్న వధూవరులిద్దరూ కచ్చితంగా 10వ తరగతిలో పాసైతేనే అర్హులు. బాల్య వివాహాలను నివారించాలనే ఉద్దేశంతో మ్యారేజ్ నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలనే రూల్​ను అమలు చేస్తున్నారు. ఈ విడత అందిస్తున్న సాయంతో కలుపుకొని వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటిదాకా 46,062 మంది లబ్ధిదారుల అకౌంట్స్​లో రూ.348.84 కోట్లు సర్కారు జమ చేసింది.

ఎస్సీలకు కూడా గవర్నమెంట్ రూ.1,00,000 అందిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు ఈ పథకం కింద రూ.1,20,000 ఆర్థిక సాయం చేస్తోంది. అదే బీసీలకైతే రూ.50,000 అందిస్తోంది జగన్ సర్కారు. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75,000 అందిస్తున్న ప్రభుత్వం.. కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు రూ.1,20,000 సాయం చేస్తోంది. మొదటి పెళ్లికి మాత్రమే ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే భర్త చనిపోయిన వితంతువుకు కూడా సాయం అందిస్తుండటం గమనార్హం. కానీ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్​కు అర్హులుగా నిర్ణయించారు.

ఇదీ చదవండి: గుంటూరు నుండి గూడురు వెళ్లి.. ప్రియుడ్ని రప్పించి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి