iDreamPost

ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందా? దీనికోసమే అర్ధరాత్రి కేబినెట్ సమావేశమా?

ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందా? దీనికోసమే అర్ధరాత్రి కేబినెట్ సమావేశమా?

రాజధాని వికేంద్రీకరణ మీద కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని నేడు శాసనమండలిలో ప్రవేశ పెట్టింది. అయితే శాసనమండలిలో టీడీపీకి ఆధిక్యత ఉండటం వలన ఈ బిల్లు ఆమోదానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే రూల్ 71 కింద చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పెట్టిన తీర్మానాన్ని చైర్మన్ ఆమోదించారు. దీనితో చర్చ వెంటనే ప్రారంభించాలని టీడీపీ సభ్యులు, రూల్ 71 ప్రకారం ఏడు రోజుల్లో ఎప్పుడైనా చర్చించవచ్చని మంత్రులు వాదనకు దిగారు. ఒక దశలో మంత్రులే పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేసారు.

Read Also: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందా? దీనికోసమే అర్ధరాత్రి కేబినెట్ సమావేశమా?

మండలిలో టీడీపీ ఆధిపత్యము ప్రభుత్వానికి చికాకులు కలిగిస్తుంది. గతంలో ఎస్సి,ఎస్టీ కార్పొరేషన్ బిల్లు,ఇంగ్లీష్ మీడియం బిల్లును మండలి తిరస్కరించి వెనక్కి పంపింది. ఈ దశలో ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఈ వాదనకు బలం చేకూర్చేలా రాత్రి 10 గంటలకు కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రులందరికీ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు అందరి చూపు శాసనమండలిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి