iDreamPost

మద్యంపై వెనక్కి తగ్గేది లేదు..

మద్యంపై వెనక్కి తగ్గేది లేదు..

మద్యం అలవాటును మాన్పించడానికి నన్ను తిట్టుకున్నా సరే ఎంతదాకా అయినా వెళతాను.. ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ చెప్పి మాట ఇది. ఇందుకు అనేకానేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ తాను అన్న మాటను నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. విమర్శలే లక్ష్యంగా వ్యాఖ్యలు చేసే ప్రతిపక్షం ఎంతగా మైకందుకుంటున్నప్పటికీ తానన్న మాటకు కట్టుబడి సీయం జగన్‌ తనదైనశైలిలో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని తీసుకు వచ్చే మద్యంపై పన్నులు చెల్లించి మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వుల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండానే, పన్నులు చెల్లించి మాత్రమే తెచ్చుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అక్రమ మద్యం రవాణాదారులకు షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. వ్యక్తికి మూడు బాటిల్స్‌ నిబంధనలను అడ్డం పెట్టుకుని అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్న వారికి ఈ దెబ్బతో చెక్‌పెట్టినట్టేనని సంబంధిత శాఖాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గరిష్టంగా రెండులీటర్ల వరకు మద్యం తెచ్చుకునేందుకు ఒక్క విదేశీ మధ్యానికి మాత్రమే అనుమతులు ఉన్నట్టుగా ఎక్సైజ్‌ చట్టంలోని నిబంధనలను కూడా ప్రభుత్వం ఉదహరించింది. దీంతో మద్యపాన నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇంకొక అడుగు ముందుకు పడ్డట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దాదాపు అయిదు రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటున్న ఏపీలో ఇతర రాష్ట్రాల సహకారం లేకుండా మద్యపాన నిషేధం విధించడం కత్తిమీద సామేనని చెప్పాలి. ఆయా రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మద్యపాన నిషేధానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతచర్యలే చేపట్టింది. ఏకంగా ఎస్‌ఈబీ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యంపై కొరఢాఝళిపిస్తోంది.

మరోవైపు ప్రైవేటు చేతుల్లో ఉండే మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిర్ణీత సమాయానికి ఖచ్చితంగా మూసివేసే విధంగా చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ధరలను పంచుతూ మద్యం వైపు చూసేందుకే భయపడే విధంగా చేస్తోంది. ఇప్పటికే బెల్టుషాపులను నియంత్రించింది. ఇటువంటి చర్యలకు ‘మూడు బాటిల్స్‌’ నిబంధన అడ్డంకిగా మారింది. అయితే ఇప్పుడు ఎక్సైజ్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి