iDreamPost

చరిత్ర సృష్టించిన జగన్ సర్కార్! ఆసియాలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆసియాలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. మాట ఇస్తే నిలబెట్టుకుండాని మరోసారి సీఎం జగన్ నిరూపించారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆసియాలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. మాట ఇస్తే నిలబెట్టుకుండాని మరోసారి సీఎం జగన్ నిరూపించారు.

చరిత్ర సృష్టించిన జగన్ సర్కార్! ఆసియాలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవేరుస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. రాయలసీమ మొదలు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కిడ్నీ సమస్సలతో బాధ పడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు మంచి నీరు అందించిన ఘనత సీఎం జగన్ కి దక్కింది. అలానే కుప్పంకి నీళ్లు అందించడం, కర్నూలు జిల్లాలో అవుకు వద్ద టన్నెలు పూర్తి చేశారు. తాజాగా జగన్ ప్రభుత్వం మరో అరుదైన చరిత్రను సృష్టించింది. వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ ను పూర్తి చేసి.. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత ఏపీ ప్రభుత్వం సొంతం  చేసుకుంది.

ప్రకాశం జిల్లాలో  పశ్చిమ ప్రకాశం పరిస్థితి చాలా విచిత్రమైనది. కరువులో రాయలసీమకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. ఒక్కప్పుడు రాయలసీమలో ఉన్న ఈ పశ్చిమ ప్రాంతం.. ప్రకాశం జిల్లా అవతరణలో ఈ జిల్లాలో కలిసింది. ఇక  ఈ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంటుంది. గత పాలకుల్లో ఎవరూ ఈ ప్రాంతానికి నీరు అందించేందుకు ప్రయత్నాలు చేయలేదు. దివంగత నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతం వాసులకు నీరందించేందుకు సంకల్పించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు.

వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్ట నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ  ఈ ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకుంది. 2019 మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసినట్టు ఇంజినీర్లు ప్రకటించారు. 2021 జనవరి 13న మొదటి సొరంగాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. మంగళవారం రెండో టన్నెల్‌ పనులు  కూడా పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది..

ఇక, దుర్భిక్ష ప్రాంతమైన పశ్చిమ ప్రకాశం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. శ్రీశైలం నుంచి సొరంగాల మార్గాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి చేశారు. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌.. వైఎస్సార్ హయాంలోనే పూర్తైంది. తాజాగా రెండో టన్నెల్  పూర్తి  కావడంతో శ్రీశైలానికి కృష్ణా వరద చేరగానే నల్లమల సాగర్‌కు నీటిని తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరా అవుతుది. అదే విధంగా ఈ మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీరు అందనుంది.

CM jagan GOVT good work

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు నుంచి నల్లమల ఫారెస్ట్ లోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు సొరంగాల తవ్వకం పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. తొలి టన్నెల్ 7 డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9.2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వాలు చేయాలని ముందుగా నిర్ణయించిన విషయం  తెలిసిందే. ఒక్కోక్క టన్నెల్ పొడవు 18. 82 కిలోమీటర్లు ఉంటుంది. అలానే మొదటి టన్నెల్ నుంచి 3000 క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్కులు చొప్పున రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా రూపొందించారు.

2019లో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండు సొరంగ మార్గం పనులు చేపట్టారు. మొదటి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలో మిగిలిన 3. 6 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత రెండో టన్నెల్ పనులు ప్రారంభించి మంగళవారం పూర్తి చేశారు.  ఈ నేపథ్యంలోనే ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత ఏపీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి.. ప్రాంత వాసుల కలను నిజం చేశారు. మరి.. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి