iDreamPost

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుండిపోయే రోజు..

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుండిపోయే రోజు..

నాయకులు మారతారు.. పార్టీలు కూడా మారుతూ ఉంటారు. అధికారం కూడా ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్నది జగమెరిగిన సత్యం. అయినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చరిత్రని చేరిపేసే ప్రయత్నం చేశారు. చివరకు రాష్ట్ర ఆవిర్భావం విషయంలో కూడా స్పష్టత లేకుండా చేశారు. రాజధాని అంశాన్ని సంక్లిష్టంగా మార్చేశారు సరే.. రాష్ట్ర ఆవిర్భావ దినం విషయంలోనూ ప్రజలను గందరగోళంలోకి నెట్టాడు. పరిపాలనాదక్షుడు అంటూ ప్రచారం చేయించుకున్న బాబు హయాంలో ఏపీ పరిస్థితికి ఈ అంశం అద్దం పడుతోంది.

చంద్రబాబు పాలనలో సాగిన తప్పిదాలు సవరించే పనిలో సాగుతున్న జగన్ ఇప్పటికే అనేక ఆటంకాలు అధిగమిస్తూ సాగుతున్నారు. అదే పరంపరలో రాష్ట్రానికి గౌరవ ప్రదమైన రీతిలో ఆవిర్భావ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కి అలాంటి పరిస్థితి లేదంటే దేశమంతా విస్మయం వ్యక్తం చేసిన దుస్థితి. దానిని సరిదిద్ది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌గా పరిణమించిన నవంబర్ 1 నాడే రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం అందరి అభినందనలు అందుకునేలా చేసింది.

ఆవిర్భావ దినోత్సవం జరువుకోలేని గత ఆరేళ్ళ అనుభవాన్ని అధిగమించి తొలిసారిగా నవంబర్‌ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు ప్రజలంతా గర్వంతో ఈరోజుని గుర్తు చేసుకుంటారని చెప్పవచ్చు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుగుతల్లికి పూలమాల వేసి అమరజీవి పొట్టిశ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం జగన్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా ఆవిర్భావ వేడుకల్లో భాగస్వామి అవుతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంచార్జి మంత్రులు, కలెక్టర్లు ఆద్శర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి