iDreamPost

ఏపిలో షూటింగులకు గ్రీన్ సిగ్నల్

ఏపిలో షూటింగులకు గ్రీన్ సిగ్నల్

కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట. జూన్ 1 నుంచి తమ రాష్ట్రంలో షూటింగులకు అనుమతి ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జిఓ కూడా విడుదల చేశారు. లొకేషన్స్ ని మూడు విభాగాలుగా డివైడ్ చేసి పది, పదిహేను, ఐదు వేల చొప్పున కాషన్ డిపాజిట్లు నిర్ణయించి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చని అందులో తెలిపింది.

15 వేలు కట్టాల్సిన విభాగంలో అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ కింద వచ్చే మ్యూజియమ్స్, స్కూల్స్, పబ్లిక్ పార్క్ తదితరాలు ఉంటాయి. 10 వేలు కట్టాల్సిన విభాగంలో దేవాదాయశాఖ కింద వచ్చే కట్టడాలు, అడవులు, హార్టీ కల్చర్, పబ్లిక్ లైబ్రరీస్ మొదలైనవి పొందుపరిచారు. 5 వేలు కట్టాల్సిన సెక్షన్ లో విశాఖ, తిరుపతి, భీమునిపట్నం, టూరిజం, ఇరిగేషన్, ఆర్అండ్ బి డిపార్మెంట్స్ పరిధిలోకి వచ్చే స్పాట్లను కేటాయించారు. ఎవరి అవసరాలకు తగ్గట్టు వీటిని ఎంచుకుని నిర్మాతలు తమ షూటింగులను ప్లాన్ చేసుకోవచ్చు.

ఇది ఇండస్ట్రీకి గుడ్ న్యూసే. అల్లు అర్జున్ పుష్ప లాంటి చిత్రాలు గోదావరి జిల్లాల సైడ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది కాబట్టి పనులను వేగవంతం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నగరాల్లోని వసతులను వాడుకుని బాలన్స్ పార్ట్ తక్కువగా ఉన్న సినిమాలు సైతం వాటి వర్క్ ని పూర్తి చేసుకోవచ్చు. ఎలాగూ వైజాగ్, ఉభయగోదావరి జిల్లాల ప్రాంతాల్లో రెగ్యులర్ గా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి నిర్మాతలు ఆసక్తి చూపించేందుకు అవకాశం ఉంది.

ఇక రేపటి నుంచి కొత్త అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి ప్రకటనే ప్రొడ్యూసర్లు ఆశిస్తున్నారు. షూటింగులతో మొదలుకుని పోస్ట్ ప్రొడక్షన్ దాకాఎన్నో పనులు ఆగిపోయిన సినిమాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు చొరవ మొదలైపోయింది కాబట్టి త్వరలోనే రెండు రాష్ట్రాల్లో తారల సందడి చూడొచ్చు. ఇంకా చాలా ఆలస్యమవుతుందేమో అనుకుంటున్న తరుణంలో ముందు ఏపి నుంచి శుభవార్తను వినాల్సి రావడం పరిశ్రమ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి