iDreamPost

ముఖ్యమంత్రి చొరవతో బంగ్లాదేశ్ జైలు నుండి విడుదలైన ఆంధ్రప్రదేశ్ జాలర్లు

ముఖ్యమంత్రి చొరవతో బంగ్లాదేశ్ జైలు నుండి విడుదలైన ఆంధ్రప్రదేశ్ జాలర్లు

గుజరాత్ రాష్ట్రం నుండి అరేబియా సముద్రంలో వేటకి వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ జైళ్లలో ఖైదీలగా మగ్గుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది జాలర్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చొరవతో పాకిస్థాన్ నుండి విడుదలైన ఘటన మరువకముందే బాంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ జాలర్లకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విముక్తి లభించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా తిప్పలవలస గ్రామానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు “అమృత” అనే మరపడవలో బంగాళాఖాతంలో చేపల వేటకి వెళ్లి పడవ ఇంజన్ లో సాకేంతిక సమస్య తలెత్తడంతో అనుకోకుండా బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో గత అక్టోబర్ 8 న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార యువజన సంఘం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకొచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కేంద్రంతో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆంధ్రప్రదేశ్ జాలర్లను విడుదల చెయ్యడానికి అంగీకరించిన బంగ్లాదేశ్ ఖైదీలను ఈ రోజు విడుదల చేస్తుండడంతో వారిని ప్రభుత్వ ఖర్చుతో స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఈ ఘటన పై ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘం ప్రస్తుత అధ్యక్షుడు వాసుపల్లి జానకి రామ్, ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సింగరావు బంగ్లాదేశ్ లో అరెస్టయిన వారి కుటుంబ సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఈ జాలర్ల అరెస్ట్ విషయాన్ని మొదట విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే ఈ సమస్య ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఇంత త్వరగా బంగ్లాదేశ్ జైలు నుండి జాలర్లు విడుదల కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణకి, విశాఖ యంపీ ఎంవివి సత్యనారాయణకు మత్స్యకార సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి