iDreamPost

తుఫాన్ బాధితులను కలిసిన సీఎం జగన్.. వారందరికీ రూ.2,500!

ఇటీవల ఏపీలో మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన బీభథ్సం అంతా ఇంతా కాదు.. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వేల సంఖ్యలో పంట నష్టం వాటిల్లింది.. విద్యత్ అంతరాయం కలిగింది.

ఇటీవల ఏపీలో మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన బీభథ్సం అంతా ఇంతా కాదు.. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వేల సంఖ్యలో పంట నష్టం వాటిల్లింది.. విద్యత్ అంతరాయం కలిగింది.

తుఫాన్ బాధితులను కలిసిన సీఎం జగన్..  వారందరికీ రూ.2,500!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వాయుగుండంగా మారి మిచౌంగ్ తుఫాన్ గా మారింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట దాదాపు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఏపిలో పలు జిల్లాలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది. అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల పంట దెబ్బతిన్నది. తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పర్యటించారు. వివరాల్లోకి వెళితే..

ఏపీలో తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు భారీస్థాయిలో పంట నష్టం వాటిల్లింది.. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేడు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం జగన్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మిచౌంగ్ తుఫాన్ కారణంగా నాలుగైదు రోజులు వరుసగా భారీ వర్షాలు పడ్డాయి.. రైతుల బాధలు చూస్తుంటే ఎంతో బాధకలుగుతుంది. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.. 60 వేల మంది బాధితులకు 25 కిలోల రేషన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం.. ప్రతి ఒక్కరికీ రూ.2,500 ఇచ్చామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉంది.. వాలంటీర్ వెళ్లి రూ.2,500 చేతికి అందజేస్తారు. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం’ అని అన్నారు.

Jagan conducts aerial surveys of cyclone impact in Tirupat

 

 

ఈ ప్రభుత్వంలో అందరికీ మంచే జరుగుతుంది.. స్వర్ణముఖి కాలువకు పడిన గండిని పరిశీలించాను. బ్రిడ్జీ లేకపోవడం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అయ్యింది.. భవిష్యత్ లో ఎవరికీ ఈ కష్టం లేకుండా హై లెవెల్ బ్రిడ్జీని రూ.30 కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను పునరుద్దరించే కార్యక్రమాలు చేపడతాం.. కొన్ని చెరువుల్లో గండ్లు పడ్డాయి.. వాటిని వెంటనే పూడిపించాలని అధికారులకు అదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైనా బాధితులు తమకు సాయం అందకపోతే.. వెంటనే జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో 1902 కి ఫోన్ చేయాలని సూచించారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. యుద్ద ప్రాతిపదికన పునరుద్దరిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరూ ఏ కష్టం పడకూడదు, అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని బాధితులకు భరోసా కల్పించారు సీఎం జగన్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి