iDreamPost

KCRను పరామర్శించనున్న AP సీఎం జగన్!

YS Jagan Meet KCR: తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌజ్ లో జారి పడిన సంగతి తెలిసిందే. అలానే ఆయనకు ఆపరేషన్ జరిగి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఏపీ సీఎం జగన్ పరామర్శించనున్నారు.

YS Jagan Meet KCR: తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌజ్ లో జారి పడిన సంగతి తెలిసిందే. అలానే ఆయనకు ఆపరేషన్ జరిగి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఏపీ సీఎం జగన్ పరామర్శించనున్నారు.

KCRను పరామర్శించనున్న AP సీఎం జగన్!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇటీవలే  డిశ్చార్ అయ్యారు. ఇక ఆయనకు ప్రమాదం జరిగిన సమయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ప్రార్థనలు చేశారు. ఇక కేసీఆర్ ను ఆస్పత్రిలో, ఇంటి వద్ద పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రముఖులు పరామర్శించారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించున్నారు.

ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయిన గులాబీ బాస్ కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ హైదరాబాద్‌కు రానున్నట్లు వైఎస్సార్ సీపీ వర్గాలు తెలిపాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ జగన్‌ మధ్య జరగనున్న భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అంతకు ముందు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి బరిలో దిగారు. దీంతో చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం ఆనాడు సంచలనంగా మారింది.

cm jagan meets kcr tomarrow

ఆ విధంగానే 2018లో తెలంగాణలో కేసీఆర్ గెలవగా, 2019లో ఏపీలో జగన్ విజయం సాధించారు. దీంతో కేసీఆర్ అనుకున్నట్లుగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడ్డాయి. ఆ తరువాత కూడా కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత వీరి మధ్య భేటీ జరగలేదు. ఇంతలోనే కేసీఆర్ కాలికి ప్రమాదం జరగడం అందరికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే  గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ను పరామర్శించనున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి భేటీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌజ్ లో జారి పడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి..చికిత్స అందించారు. ఆ సమయంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు కేసీఆర్ ను పరామర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో 20 మంది వైద్యుల టీమ్ కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ చేశారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేటీఆర్ కి ఫోన్ చేసి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తాజాగా కేసీఆర్ ను సీఎం జగన్  కలిసి పరామర్శించనున్నారు. మరి.. వీరి భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి