iDreamPost

మండలి రద్దు దిశగా… ఢిల్లీలో ఫలించిన జగన్ మంత్రాంగం

మండలి రద్దు దిశగా… ఢిల్లీలో ఫలించిన జగన్ మంత్రాంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ప్రోరోగ్ చేసిన సభలను తిరిగి సమావేశ పరచాలంటే ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు మళ్ళి గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి. ఈ మధ్య కాలంలో అంటే సభలు ప్రోరోగ్ అయిన తరువాత ప్రభుత్వం ఏదైనా ముఖ్య చట్టాలను చెయ్యాలంటే “ఆర్డినెన్సు” విడుదల చేస్తారు. ఆర్డినెన్సు విడుదల చేసిన ఆరు నెలల లోపు దానికి చట్ట సభల ఆమోదం పొందాలి…

ఉభయ సభలను ప్రోరోగ్ చేసినా ఒకే సభను అంటే శాసనసభను మాత్రమే సమావేశపరచమని ప్రభుత్వం కోరితే గవర్నర్ కేవలం శాసనసభనే సమావేశపరుస్తారు. శాసనమండలిని కూడా విధిగా సమావేశపరచాలని లేదు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసి అది ఆమోదం పొందే వరకు మండలిని సమావేశ పరచలేదు…

Also Read :జగన్ చెప్పినట్లు మండలి రద్దుకు రామోజీ రావే కారణమా?

So … రూల్ 71,సెలెక్ట్ కమిటీ అన్నీ మూన్నాళ్ళ ముచ్చట అయినట్లే!శాసనమండలి కార్యదర్శి రూల్ 154 ప్రకారం సెలెక్ట్ కమిటీ చెల్లదు అని ఇప్పటికే చెప్పేశాడు … 

మండలి రద్దయినా సెలెక్ట్ కమిటీ కొనసాగుతుంది అన్ని చెప్పిన మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు మండలి కార్యదర్శి సెలెక్ట్ కమిటీ చెల్లదు అని ప్రకటించిన తరువాత అదే మాటలు కొనసాగించటం తప్ప చేయగలిగింది ఏమి లేదు..రాజ్యసభకున్న హక్కులు మండలికి కూడా ఉన్నాయని చెప్తూ మభ్యపెట్టటం తప్ప సాధించే ఫలితం ఏమి లేదు…

ఇప్పుడు ఏమి జరుగుతుంది?శాసనసభను మాత్రమే ఒకటి లేదా రెండు రోజులు సమావేశ పరిచి మండలి సెలెక్ట్ కమిటీకి పంపిన రాజధాని వికేంద్రీకరణ,ఆంగ్ల విద్య బిల్లును ఉపసంహరించుకొని సమావేశాలు ముగిసిన తరువాత ఆర్డినెన్సు తీసుకురావచ్చు.

ఆంధ్రజ్యోతి అక్కడే ఉండి చూసినట్లు ముఖ్యమంత్రి జగన్ను ప్రధాని మోడీ మందలించినట్లు రాసినా, ఈ సాయంత్రం గవర్నర్ సభలను మరో నెలలో బడ్జెట్ కోసం సమావేశమవ వలసిన సభలను ప్రోరోగ్ చేశారు అంటే మోడీ నుంచి జగన్ కు మద్దతు దక్కినట్లే భావించాలి. అనుకున్నట్లు జగన్ రేపు హోమ్ మంత్రి అమిత్ షా ను కలిస్తే అన్ని విషయాలు క్లియర్ అవుతాయి…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి