iDreamPost

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. 67 శాతం విద్యార్థులు పాస్, బాలికలదే పై చేయి !

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. 67 శాతం విద్యార్థులు పాస్, బాలికలదే పై చేయి !

ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వచ్చాక.. రెండేళ్ల తర్వాత 10 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 2021-22 విద్యాసంవత్సరంలో 6,21,799 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా.. 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం 67.72 శాతం మంది విద్యార్థులు టెన్త్ పాస్ అవ్వగా.. వారిలో బాలురు 64.02 శాతం.. బాలికలు 70.70 శాతం మంది పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. టెన్త్ ఫలితాలను విద్యార్థులు http://www.results.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. కాగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.30 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా.. అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఏడాది ర్యాంకులు, గ్రేడ్ ల సిస్టమ్ ను తీసేసి.. కేవలం మార్కులను మాత్రమే ప్రకటించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్మీ, ఇతర ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతుండటంతో.. గ్రేడ్ల విధానానికి స్వస్తి పలికింది. కాగా.. జులై మొదటి లేదా రెండో వారంలో టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి