iDreamPost

Anushka Shetty 50th Film: అనుష్క శెట్టి 50వ సినిమా టైటిల్ ఖరారు

వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాలు చేసే అనుష్క శెట్టి... ఇటీవలే మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా అనుష్క 50 చిత్రం టైటిల్ ఖరారు అయింది. మరి..అనుష్క 50వ చిత్రం టైటిల్, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాలు చేసే అనుష్క శెట్టి... ఇటీవలే మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా అనుష్క 50 చిత్రం టైటిల్ ఖరారు అయింది. మరి..అనుష్క 50వ చిత్రం టైటిల్, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

Anushka Shetty 50th Film: అనుష్క శెట్టి 50వ సినిమా టైటిల్ ఖరారు

అనుష్క శెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలకి సమానంగా క్రేజ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా సాధించింది హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమాతోనే యువత మదిలో నిలిచిపోయింది. అనేక సినిమాల్లో నటించినా అరుధతి, భాగమతి, బాహు బలి లాంటిసినిమాలతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈసినిమాల తరువాత ఆమె ఆల్మెస్ట్ సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. ఇటీవలే నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ను పలుకరించింది. ఈమూవీ  చేయబోతున్న సినిమా అనుష్క కెరీర్ లో 50 సినిమలు కంప్లీట్ కాబోతున్నాయి. తాజాగా స్విటీ 50 సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే.  అలాంటి హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి ఒకరు.  తన అందం, అభినయం, మూవీ సక్సెస్ తో హీరోలకు సమానంగా  ఇండస్ట్రీలో తన క్రేజ్ ను పెంచుకుంది. ఇక అనుష్క సూపర్ హిట్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ అరుధతికే దక్కుతుంది. ఆ సినిమా తరువాత అనేక హిట్ సినిమాలను స్వీటి తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిలో నటించింది. ఇది ఇలా  ఉంటే.. ఆమె అభిమానులకు  ఓ గుడ్ న్యూస్. అనుష్క శెట్టి 50వ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఓ ఈవెంట్​లో అనుష్క 50వ చిత్రం టైటిల్​ను అనౌన్స్ చేశారు.

Ghaati

 

అనుష్క 50వ సినిమాకు ‘ఘటి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. పొగాకు వ్యాపారంలో చిక్కుకున్న ఓ మహిళ కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. అనుష్క ఈ జోనర్​లో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబోలో వస్తున్న రెండో ఫిల్మ్ ఇది. ‘వేదం’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ల కలయికలో సినిమా రూపొందుతోంది. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటవుతున్నారు. ప్రైమ్ వీడియో సినిమా పోస్ట్ థియేట్రికల్ హక్కులను పొందింది. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వంశి కృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీనివాసరావు, క్రిష్ జాగర్లమూడి, బుర్ర సాయి మాధవ్ ను కథను సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అనుష్క శెట్టి 50వ సినిమా టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి