iDreamPost

Volcano: ఇదేం విచిత్రం.. బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం.. ఎక్కడంటే

  • Published Apr 20, 2024 | 2:58 PMUpdated Apr 20, 2024 | 2:58 PM

బంగారం భూమి లోపల ఉంటుంది అని మనకు తెలుసు. కానీ ఓ చోట మాత్రం అగ్ని పర్వతం ప్రతి రోజు లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారాన్ని బయటకు చిమ్ముతుంది. ఆ వివరాలు..

బంగారం భూమి లోపల ఉంటుంది అని మనకు తెలుసు. కానీ ఓ చోట మాత్రం అగ్ని పర్వతం ప్రతి రోజు లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారాన్ని బయటకు చిమ్ముతుంది. ఆ వివరాలు..

  • Published Apr 20, 2024 | 2:58 PMUpdated Apr 20, 2024 | 2:58 PM
Volcano: ఇదేం విచిత్రం.. బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం.. ఎక్కడంటే

సాధారణంగా అగ్ని పర్వతాలు పేలితే.. లావా, భారీ ఎత్తున బూడిద వంటివి బయటకు వస్తుంటాయి. ఇక ఈ ఘటనలు చాలా ప్రమాదకరం కూడా. కొన్ని సందర్భాల్లో అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందితే.. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట అగ్ని పర్వతాలు విస్ఫోటనం సంఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం జనాలతో పాటు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలా అబ్బురపోయే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అగ్ని పర్వతం ప్రతి రోజు భారీ ఎత్తున​ బంగారాన్ని బయటకు చిమ్ముతుంది. ఇప్పటికి వందల కేజీల పుత్తడిని ఇలా వెదజల్లింది. ఇంతకు ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది.. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే..

అంటార్కిటికాలోని మౌంట్‌ ఏర్‌బస్‌ అనే అగ్ని పర్వతం ఇలా బంగారాన్ని బయటకు చిమ్ముతుంది. ప్రతిరోజూ 80 గ్రాముల పసిడిని ఇలా చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ అగ్ని పర్వతం కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు పేర్కొన్నారు.

అగ్ని పర్వతం కింద బంగారు గని ఉండొచ్చని.. అందుకే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వార్త తెలిసిన పసిడి ప్రియులు.. కిలోల కొద్ది బంగారం వృధాగా పోతుందే అని వాపోతున్నారు. మాకు దొరికితే ఎంత బాగుండో అని ఆశపడుతున్నారు. ఇక ఈ అగ్ని పర్వతం ప్రతి రోజు చిమ్ముతున్న బంగారం ఖరీదు.. ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని.. ఆ మొత్తం వృధా అవుతుందే అని పసిడి ప్రియులు అల్లాడిపోతున్నారు.

ఇక రెండు రోజుల క్రితం ఇండోనేషియా అగ్నిపర్వత విస్ఫోటనం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 5సార్లు పలు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. సులవేసి ద్వీపానికి ఉత్తరాన ఉన్న స్టాటోవోల్కానో మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం గురువారం బద్దలైంది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నాయి. ఆ దేశ జియోలాజికల్‌ ఏజెన్సీ అక్కడ సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగాన్నిహెచ్చరించింది. సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి