iDreamPost

బిగ్ బ్రేకింగ్: మరో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి!

Rail Accident at Jarkhand: దేశంలో రోజుల వ్యవధుల్లో ఎక్కడో అక్కడ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఝార్ఖండ్ మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

Rail Accident at Jarkhand: దేశంలో రోజుల వ్యవధుల్లో ఎక్కడో అక్కడ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఝార్ఖండ్ మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

బిగ్ బ్రేకింగ్: మరో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి!

ఇటీవల దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. టెక్నికల్ లోపాలు, మానవ తప్పిదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరగడం.. వందల సంఖ్యల్లో ప్రాణాలు పోవడం చూస్తూనే ఉన్నాం. గత ఏడాది జూన్ నెలలో ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది చనిపోయారు. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఒడిశా రైలు ప్రమాదంలో తర్వాత దేశంలో మరికొన్ని రైలు ప్రమాదాలు జరిగాయి. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఝార్ఖండ్ లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఝార్ఖండ్ లో మరో రైలు ప్రమాదాం జరిగింది.  బుధవారం సాయంత్రం జార్ఖండ్‌లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు, అయితే చాలా మంది గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ సంఘటన జమ్తారా-కర్మతాండ్‌లోని కల్ఝరియా సమీపంలో జరిగింది.   సమాచారం అందుకున్న రైల్వే యంత్రాంగం, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న ప్రయాణికులు భాగల్‌పూర్ వెళ్లే అంగా ఎక్స్‌ప్రెస్ నుండి దూకడంతో ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు తెలుస్తుంది.

రైలు వస్తున్నది కూడా పట్టించుకోకుండా పట్టాలపైకి దూకిన వెంటనే, ఝఝా-అసన్సోల్ రైలు వారిని ఢీకొట్టిందని దైనిక్ జాగరణ్ నివేదించారు. ‘జామ్తారాలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు.. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారికి వైద్యం అందిస్తున్నారు’అంటూ జమ్తారా డిప్యూటీ కమిషనర్ మీడియాకు వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి