iDreamPost

టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్

  • Published Feb 11, 2024 | 3:11 PMUpdated Feb 11, 2024 | 3:11 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ అనౌన్స్ చేయడం ఫిల్మ్ మేకర్స్ కు ఫ్యాషన్ గా మారింది. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటి నుంచి సీక్వెల్ అనౌన్స్ చేయడం చాలా మామూలు విషయం లాగా అయిపోయింది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ అనౌన్స్ చేయడం ఫిల్మ్ మేకర్స్ కు ఫ్యాషన్ గా మారింది. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటి నుంచి సీక్వెల్ అనౌన్స్ చేయడం చాలా మామూలు విషయం లాగా అయిపోయింది.

  • Published Feb 11, 2024 | 3:11 PMUpdated Feb 11, 2024 | 3:11 PM
టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్

టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ ఊపు వచ్చింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ సినిమా సీక్వెల్ లేదా ఫ్రాంచైజ్ అని అనౌన్స్ చేయడం చాలా మామూలు విషయం లాగా అయిపోయింది. అయితే అవన్నీ నిజంగా వస్తాయా లేవా అన్నది అనుమానమే. వాస్తవానికి ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటి నుంచి సీక్వెల్స్ అనౌన్స్ చేయడం ఫిల్మ్ మేకర్స్ కు ఫ్యాషన్ గా మారింది. అంతకంటే ముందే ఆర్య 2 లాంటి సీక్వెల్స్, ఫ్రాంచైజీ సినిమాలు వచ్చాయి కానీ బాహుబలి నిజంగానే ఊహించని విజయాన్ని సాధించింది, ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 లాంటివి కూడా ఈ ట్రెండ్ కు మరింత ప్లస్ అయ్యాయి.

పుష్ప 2, కాంతార 2, సలార్ 2, జై హనుమాన్, యానిమల్ 2 (యానిమల్ పార్క్) వంటి నిజమైన సీక్వెల్స్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే పేరుకే సీక్వెల్ అనౌన్స్ మెంట్ జరిగిన సినిమాలు కొన్ని ఉన్నాయి. స్కంద, పెద్ద కాపు, , సైంధవ్, ఇటీవలే ఈగల్ వంటి సినిమాల చివర్లో సీక్వెల్ ఉంటుందనే చిన్న లింక్ ను ప్రేక్షకులకి ఇచ్చారు. అయితే తొలి భాగం బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాకపోవడంతో స్కంద, పెద కాపు, సైంధవ్ వంటి చిత్రాలు సీక్వెల్ ను తీయడం అనేది జరగక పోవచ్చు. ఈగల్ సినిమా రిజల్ట్ తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

పైన ఉదాహరించిన పెద కాపు, స్కంద వంటి సినిమాల కంటెంట్ చూశాక కూడా సీక్వెల్ కు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ను సినిమా చివర్లో ఎలా చేర్చారని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కేవలం క్రేజ్ కోసమే మేకర్స్ ఇలాంటి స్ట్రాటజీ వాడతారని మరో వర్గం ప్రేక్షకులు అంటున్నారు. నిజంగా ఒక సినిమాకి రెండు లేదా మూడు భాగాల్లో చెప్పే కథ ఉంటేనే సీక్వెల్స్ అనౌన్స్ చేస్తేనే మంచిదని పలువురు సినీ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి